రోడ్డు ప్రమాదంలో ఎంఈఓ మృతి
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంఈఓ బోడ హనుమాజీ(46) మృతిచెందాడు. హనుమాన్జీ హన్మకొండ నుంచి బైక్పై వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన హనుమాన్జీని వరంగల్ ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ మధ్యాహ్నం మరణించాడు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.