hanuman jayanti shobha yatra
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
Hanuman Shobha Yatra: ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి నేపథ్యంలో జరిగే విజయ్ యాత్రకు పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన ఊరేగింపు గౌలిగూడ రామ్ మందిర్‌లో ఉదయం 11.30 గంటలకు మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వద్ద రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఈ మార్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా 12 కి.మీ సాగుతుంది. మరో ఊరేగింపు రాచకొండ పరిధిలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద మొదలై వివిధ మార్గాల్లో 10.8 కి.మీ ప్రయాణిస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఈ మ్యాప్‌ను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు మినహా కొత్త ఊరేగింపులకు ప్రధాన ఊరేగింపులో కలవడానికి అనుమతించరు. నగర పోలీసులతో పాటు ఇతర విభాగాలతో కలిపి మొత్తం 8 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సహా వివిధ విభాగాలతో భేటీ అయిన నగర పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. #HYDTPinfo Commuters, please note traffic diversions in connection with the “Sri Hanuman Jayanthi Vijaya Yathra” procession on 16-04-2022 at 0900 hours, starting from Gowliguda Ram Mandir to Tadbund Sri Veeranjaneya Swamy Temple. pic.twitter.com/BrOuGXBy0D — Hyderabad Traffic Police (@HYDTP) April 15, 2022 రూట్‌మ్యాప్ ► బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో అన్ని శాఖలకు కలిపి ఉమ్మడి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సున్నిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ స్పేస్ పోలీసింగ్‌లో భాగంగా సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ► ఊరేగింపుపై షీ– టీమ్స్, మఫ్టీ పోలీసులు కన్నేసి ఉంచనున్నారు. విజయ్ యాత్ర జరిగే మార్గాలతో పాటు చుట్టుపక్కల రూట్లలోనూ ముమ్మర తనిఖీలు, సోదాలు చేయనున్నారు. ఊరేగింపు నేపథ్యంలో శనివారం మద్యం విక్రయాలను నిషేధించారు. యాత్ర జరిగే మార్గాల్లో శుక్రవారం పర్యటించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు. ► బందోబస్తుతో పాటు ఇతర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘శనివారం పనిదినం కావడంతో సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నాం. ఊరేగింపు జరిగే మార్గాల్లోని ఎత్తైన భవనాలపై ఉండే ప్రత్యేక సిబ్బంది రూఫ్ టాప్ వాచ్ నిర్వహిస్తారు. అవసరమైన స్థాయిలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లును వాడుతున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఈ ప్రాంతాల్లోనే.. శనివారం ఉదయం 11.30– 12 గంటల మధ్య గౌలిగూడ నుంచి విజయ్ యాత్ర మొదలవుతుంది. మరో కర్మన్‌ఘాట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపులు ఏయే ప్రాంతాలకు చేరుకుంటే అక్కడ, ఆయా సమయాల్లో మళ్లింపులు, ఆంక్షలు అమలవుతాయి. నిర్దేశిత సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా 040– 27852482, 90102 03626, లేదా హైదరాబాద్ పోలీసు సోషల్‌మీడియా యాప్స్‌ను సంప్రదింవచ్చు. -
ఘనంగా ముగిసిన హనుమజ్జయంతి
-
ఘనంగా హనుమజ్జయంతి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శనివారం కాషాయవర్ణ శోభితమైంది. హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు భారీఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ప్రదర్శనకు నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో రహదారులు కిక్కిరిసాయి. గౌలిగూడ, కోఠి, ఆబిడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ తదితర మార్గాల్లో శోభాయాత్ర సాగింది. డీజే ఏర్పాటుకు పోలీసులు నిరాకరించడంతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాపిక్ స్తంభించింది. ఆబిడ్స్, కోఠి మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 3 గంటలకుపైగా అంతరాయం ఏర్పడింది. చివరకు పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గమనించిన ఉన్నతాధికారులు డీజేకు అనుమతినివ్వడంతో మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో భజరంగదళ్ నేతలు ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని, అందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకలకు భక్తులు పోటెత్తారు. భక్తుల దర్శనం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యులు పాండు యాదవ్, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తదితరులు వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతి నేపథ్య ంలో శనివారం జరుగనున్న భారీ ఊరేగింపునకు నగర పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు విభాగంలో ఉన్న సిబ్బందితో పాటు సాయుధ బలగాలనూ బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 14 వేల మందిని బందోబస్తుకు కేటాయించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురు–శుక్రవారాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేయడంతో పాటు బందో బస్తు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాన ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు ప్రారంభం, ముగింపు జరిగే దేవాలయాలను కమిషనర్ సం దర్శించారు. గౌలిగూడ రామ్‌మందిర్ వద్ద ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు నగరంలో ని మూడు జోన్ల పరిధిలో 27 కిమీ మేర సాగుతూ తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ముగుస్తుంది. మరోపక్క తూర్పు మండలంలోని ఐఎస్ సదన్ నుంచి మరో ఊరేగింపు మూడు కిలోమీటర్లు సాగి గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మొత్తమ్మీద 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కిమీ మేర జరిగే ఊరేగింపును కమ్యూనిటీ, ట్రాఫిక్ సీసీ కెమెరాల ద్వారా బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి పర్యవేక్షించనున్నారు. అదనంగా 570 తాత్కాలిక, మూవింగ్, వెహికిల్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు మరో 300 హ్యాండీ క్యామ్స్ అందిస్తున్నారు. ఆద్యంతం ప్రతి ఘట్టాన్నీ చిత్రీకించేలా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించిన పోలీసులు... శుక్రవారం రాత్రి నుంచే బారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. బందోబస్తునూ రెండు రకాలు గా విభజించారు. శోభాయాత్ర వెంట ఉండేందు కు కొందరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి మరికొంత మందిని కేటాయిస్తున్నా రు. ప్రతి జోన్‌ను ఆయా డీసీపీలు బాధ్యత వహిస్తారు. వీరికితోడు ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఊరేగింపు ముందు, ముగింపులో అదనపు, సంయుక్త పోలీసు కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఊరేగింపులో దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. అసాంఘిక శక్తులపై డేగకన్ను... ఊరేగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్వాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శాంతిభద్రత విభాగంలో పాటు టాస్క్‌ఫోర్స్ అధికారులూ అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు మైత్రీ, పీస్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేస్తున్నారు. మరోపక్క టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసుల రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి కొందరిని బైండోవర్ సైతం చేస్తున్నారు. ఊరేగింపు బందోబస్తు విధుల్లో ఉండే ప్రతి పోలీసు తమ చుట్టూ ఉన్న 25 మీటర్ల మేర కన్నేసి ఉంచుతారు. అక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ... స్మార్ట్ ఫోన్లలో ఉన్న ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తుంటారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే వారి ఫోటోలతో పాటు వివరాలనూ పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలు... హనుమజ్జయంతి నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గౌలిగూడ రా>మ్మందిర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, డీఎం అండ్ హెచ్ఎస్ సర్కిల్, రామ్ కోఠి చౌరస్తా, కాచిగూడ జంక్షన్, వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌస్, ఎంజీ రోడ్, బాలమ్రాయ్ మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగనున్న ఈ మార్గంలో ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతుల నేపథ్యంలో వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్ సూచించారు. మరోపక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. అవసరమైన పక్షంలో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తారు. ♦ బందోబస్తు విధుల్లో ఐదుగురు అదనపు సీపీలు, ఒక సంయుక్త సీపీ, 13 మంది డీసీపీలు, 19 మంది అదనపు డీసీపీలు, 65 మంది ఏసీపీలు, 235 మంది ఇన్స్పెక్టర్లు, 670 మంది సబ్–ఇన్స్పెక్టర్లతో కలిపి మొత్తం 14 వేల మంది పాల్గొంటారు. ♦ చార్మినార్ ప్రాంతానికి అదనపు సీపీ (క్రైమ్) షికా గోయల్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. సిద్ది అంబర్‌బజార్ మసీదు వద్ద క్యాంపు చేసే అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ మధ్య మండలాన్ని పర్యవేక్షించనున్నారు. అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ పోలీసు కమిషనర్‌కు సహకరిస్తూ నగర వ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. ఊరేగింపు ప్రారంభంలో అదనపు సీపీ (సీఏఆర్) ఎం.శివప్రసాద్, ముగింపులో అదనపు సీపీ (పరిపాలన) టి.మురళీకృష్ణ ఉండనున్నారు. ♦ టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఊరేగింపు ఆద్యంతం బందోబస్తు నిర్వహించనున్నాయి. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సుల్తాన్‌బజార్ డివిజన్‌కు నేతృత్వం వహించనున్నారు. ♦ పోకిరీలకు చెక్ చెప్పడానికి షీ–టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. ♦ కమ్యూనికేషన్ పరికరాలు, బైనాక్యులర్లతో ఎల్తైన భవనాలపై రూఫ్ టాప్ వాచ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. -
హనుమాన్ జయంతి శోభాయాత్ర