Hari Krishna Prasad
-
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
సంయుక్తంగా అగ్రస్థానంలో హరికృష్ణ
కోల్‌కతా: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో పురుషుల ర్యాపిడ్ విభాగంలో తొలి మూడు రౌండ్లు ముగిశాక... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండు పాయింట్లతో అరోనియన్, మమెదైరోవ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం మొదలైన ఈ మెగా టోర్నమెంట్లో 10 మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం పోటీపడుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్, లెవాన్ అరోనియన్ (అర్మేనియా), షకిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), సో వెస్లీ (అమెరికా), హికారు నకముర (అమెరికా), సెర్గీ కర్జాకిన్ (రష్యా)లాంటి మేటి గ్రాండ్‌మాస్టర్స్‌తోపాటు భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీ, విదిత్, నిహాల్ సరీన్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. సూర్యశేఖర గంగూలీతో జరిగిన ర్యాపిడ్ తొలి గేమ్‌ను 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... రెండో గేమ్‌లో 42 ఎత్తుల్లో మమెదైరోవ్‌ను ఓడించాడు. నకమురతో జరిగిన మూడో గేమ్‌ను హరికృష్ణ 38 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. విశ్వనాథన్ ఆనంద్ తాను ఆడిన మూడు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. తొలి గేమ్‌ను సో వెస్లీతో 145 ఎత్తుల్లో... రెండో గేమ్‌ను కర్జాకిన్‌తో 31 ఎత్తుల్లో... మూడో గేమ్‌ను అరోనియన్‌తో 38 ఎత్తుల్లో ఆనంద్ ‘డ్రా’ చేసుకున్నాడు. -
మూడ్రోజుల ముందే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగింపు
తర్వాతే టెరా సాఫ్ట్‌వేర్‌కు నజరానా.. ‘సాక్షి’కి ఇన్‌క్యాప్ వివరణ సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌లిస్టులో ఉన్న ‘టెరా సాఫ్ట్వేర్’ కంపెనీకి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కట్టబెట్టారంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంలో వాస్తవం లేదని, బిడ్స్ దాఖలు చేయడానికి ఉన్న గడువుకు సరిగ్గా మూడు రోజలు ముందే ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తప్పించినట్లు ఇన్కాప్యప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వివరణ ఇచ్చింది. ‘బిడ్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 7 ఆఖరు తేదీ. 2015 మేలో టెరాను బ్లాక్‌లిస్టులో పెడుతూ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత పరిస్థితిని సమీక్షించిన పౌర సరఫరాల శాఖ.. టెరాను బ్లాక్‌లిస్టు నుంచి తొలగిస్తూ ఆగస్టు 4న (బిడ్స్ దాఖలు చేయడానికి సరిగ్గా 3 రోజుల ముందు) నిర్ణయం తీసుకుంది. అదే రోజు పౌర సరఫరాల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా టెరాను బ్లాక్‌లిస్ట్ నుంచి ‘ఏపీటీఎస్’ తొలగించింది. బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడటంతో.. ఆగస్టు 7న ‘టెరా’ బిడ్స్ దాఖలు చేసింది’ అని వివరణలో పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించింది కూడా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్ ఎలా ఇస్తారనే. అయితే ఇందుకు వివరణగా టెండర్ దాఖలుకు మూడ్రోజుల ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించినట్లు పేర్కొనడం చూస్తుంటే సాక్షి కథనం వాస్తవమేనని స్పష్టమవుతోంది. అలాగే టెండర్ మదింపు కమిటీలో వి.హరికృష్ణప్రసాద్‌ను ఎలా నియమిస్తారని ‘సాక్షి’ ప్రశ్నించగా ఈ-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా, టెండర్ మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించినట్లు వివరణలో పేర్కొన్నారు.