బావిలో యువకుడి మృతదేహం
ఆదిలాబాద్(ఇంద్రవెల్లి): ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఆర్కేపూర్లో డాకూర హరిదాస్ (25) శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి, ఇంటికి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం బావిలో మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచార మిచ్చారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.