Haris Jayaraj
-
‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!
సాక్షి, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు వారి కలలను పిల్లలపై రుద్దకూడదనే సందేశాన్ని తెలుపుతూ పూర్తి వినోదాత్మకంగా, మ్యూజికల్‌గా సాగిన చిత్రం ‘వాసు’ . విక్టరీ వెంకటేష్- భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. యూత్, ఫ్యామిలీ, మాస్ ఇలా అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. సీసీ మీడియా ఎంటర్టైన్మెంట్పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నేటికి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు మీకోసం.. ‘వాసు’సినిమా పేరు మదిలో మెదలగానే అందరికి గుర్తొచ్చేవి పాటలు. ప్రతీ ఒక్క పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా...’, ’ఓ ప్రేమా.. ఓ ప్రేమా..’ అంటూ సాగే పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో అలరించాయి. వెంకటేష్ నటన ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సంగీతంపై తన ఇష్టాన్ని తెలుపుతూనే దివ్య(భూమిక)పై ప్రేమ, తండ్రిపై భయం రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అంతేకాకుండా సునీల్, అలీ, దర్మవరపు సుబ్రమణ్యంలతో వెంకీ చేసే కామెడీ మామూలుగా ఉండదు. అమ్మ, చెల్లితో వచ్చే సెంటిమెంట్ సీన్స్, ప్రేమను వ్యక్తపరిచే సమయంలో వచ్చే ట్విస్టులు ప్రతీ ఒక్కరి మనసులను కదిలించేలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హార్ట్ టచింగ్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ‘వాసు’ వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ చిత్రం వస్తే ఛానల్ మార్చకుండా చూసేవారు అనేకమంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతీ సీన్‌ను చాల చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు కరుణాకరన్. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నారు కదా.. కుటుంబసమేతంగా మ్యూజికల్ హిట్ ‘వాసు’ సినిమాను మరో చూసి ఎంజాయ్ చేయండి. చదవండి: పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా మరోసారి అక్షయ్ భారీ విరాళం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_761247569.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇరుముగన్ తెరకెక్కుతుందా?
మొత్తానికి ఇరుముగన్ చిత్రాన్ని సంచలన విజయంగా ప్రేక్షకులు డిసైడ్ చేశారు.దీంతో ఆ చిత్ర యూనిట్ విజయోత్సాహంలో మునిగిపోయారు. సియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. తన పాత్రల కోసం తీవ్ర కసరత్తులు చేసే ఈయన ఇరుముగన్ చిత్రానికి అలాంటి శ్రమనే కోరుకున్నారు. అంతగానూ సక్సెస్ అయ్యారు. విక్రమ్ అఖిలన్, లవ్ అనే రెండు పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని శిబు ఫిలింస్ పతాకంపై శిబుతమీన్స్ నిర్మించారు. నయనతార,నిత్యామీనన్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. అరిమానంబి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన శంకర్ శిష్యుడు ఆనంద్ శంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు.ఆరా సంస్థ గత వారం తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేసిన ఇరుముగన్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ విజయ బాటలో పయనిస్తోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌తో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా చిత్రం దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ అరిమానంబి చిత్రం చూసి అభినందించిన విక్రమ్ మంచి కథ ఉంటే చెప్పండి కలిసి చేద్దాం అని అన్నారన్నారు. నిజానికి అప్పుడు తన వద్ద స్క్రిప్ట్ ఏదీలేదన్నారు.ఒక సింగిల్ లైన్ మాత్రమే చెప్పానన్నారు. అది చాలా బాగుంది బాగా ఇంప్లిమెంట్ చేయమని విక్రమ్ చెప్పారన్నారు. దీంతో తన బాధ్యత మరింతపెరిగిందని అన్నారు. ఒరుముగన్ చిత్రం విజయం వెనుక యూనిట్‌లోని ప్రతి వారి కృషి ఉందని అన్నారు. చిత్ర హీరో విక్రమ్ మాట్లాడుతూ నిజానికి ఇరుముగన్ చిత్రం తెరకెక్కుతుందో? లేదోనన్న ఆందోళనతో ఉన్నామన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మాత శిబుతమీన్ రంగంలోకి ప్రవేశించి రెండే రోజుల్లో సమస్యల్ని పరిష్కరించి ఇరుముగన్ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తన తన భుజస్కందాలపై వేసుకుని ఈ విజయానికి కారణం అయ్యారన్నారు. ఇక అఖిలన్, లవ్ పాత్రల్లో ఏ పాత్ర కష్టం అనిపించిందని అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి కృషి చేశానన్నారు. ముఖ్యంగా లవ్ పాత్రను కొంచెం ఎక్కువ చేసినా, తక్కువ చేసినా ఇంత ఫలితం ఉండేది కాదన్నారు. నయనతార, నిత్యామీనన్, తంబిరామయ్య ఇలా అందరూ తమతమ పాత్రలకు న్యాయం చేశారని అందుకే ఇరుముగన్ ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణను పొందుతోందని విక్రమ్ అన్నారు. ఇరుముగన్ చిత్రం తమిళనాడులో విడుదల చేసిన ఆరా ఫిలింస్ అధినేత సురేశ్ మాట్లాడుతూ ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లోనే 29.5 కోట్లు వసూల్ చేసిందని తెలిపారు.వచ్చే వారం కూడా ఒక థియేటర్ తగ్గకుండా ప్రదర్శింపడుతుందని చెప్పారు. -
22న తెరపైకి ఇరండాం ఉలగం
ఇరండాం ఉలగం ఈ నెల 22న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆర్య, అనుష్క తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇరండాం ఉలగం. దీన్ని పీవీపీ సినిమా సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మించింది. సెల్వరాఘవన్ అద్భుత సెల్యులాయిడ్ సృష్టి. హారిష్ జయరాజ్ పాటలకు బాణీలు కట్టారు. అనిరుద్ నేపథ్య సంగీతాన్ని అందించారు. రెండేళ్లకు పైగా చిత్ర నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి ఒక్క కట్ కూడా లేకుండా యు సర్టిఫికెట్ రావడంతో పాటు అద్భుతమైన కాన్సెఫ్ట్‌తో రూపొందించిన చిత్రం ఇరండాం ఉలగం అని సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. వర్ణ పేరుతో తెలుగులోను అనువాదమవుతున్న ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి రానుంది.