Harish Rana
-
13 ఏళ్ల పోరాటం : తనువు చాలించిన హరీష్ రాణా
న్యూఢిల్లీ: నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి (passive euthanasia) చట్టపరమైన ఆమోదం పొందిన భారతదేశంలోని తొలి వ్యక్తి హరీష్ రాణా కన్నుమూశారు. మంగళవారం (మార్చి 24) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. దీంతో హరీష్ మరణం దేశ వైద్య-చట్టపరమైన రంగంలో ఒక కీలక ఘట్టంగా మిగిలింది. మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గౌరవప్రదమైన రీతిలో ప్రాణాలు విడిచేలా వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ ర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయనకు అందిస్తున్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు. దీంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిగా ఉన్నప్పుడు, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలైన 31 ఏళ్ల హరీష్ రాణా, 2013 నుంచి కోమాలో ఉన్నారు. గత దశాబ్దానికి పైగా కృత్రిమ పోషణ, అడపాదడపా ఆక్సిజన్ సహాయంతో రాణా జీవించారు. నిపుణుల పర్యవేక్షణలోమార్చి 14న రానాను ఘాజియాబాద్‌లోని తన నివాసం నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో రానాకు అందుతున్న కృత్రిమ పోషకాహార మద్దతును (Artificial Nutritional Support) క్రమంగా ఉపసంహరించారు. న్యూరో సర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ నిపుణులు సహా, డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షించింది.ప్యాసివ్ యుథనేషియా అంటే ఏమిటి?కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ జీవన మద్దతును (వెంటీలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటివి) నిలిపివేయడం ద్వారా మరణం సంభవించేలా చేయడం. దీనిని సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతించింది. -
కారుణ్య మరణానికి ఒకే.. కంటతడితో సుప్రీంకోర్టు తీర్పు
-
హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించింది. హరీష్ రాణా తల్లిదండ్రుల అభ్యర్థనలతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 11, 2026) తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రాణా పాసివ్ యూతనేషియా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసుగా నిలిచింది. ఇక ఈ కేసు తుది తీర్పు విచారణకు ముందు సుప్రీం కోర్టు హరీష్ రాణా ఆరోగ్య పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసింది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్‌కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్‌క్లేవ్‌లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్‌కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్‌పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్‌కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్‌ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు. తాజాగా, అత్యున్నత న్యాయ స్థానం పాసివ్ యూతనేషియాకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. -
‘ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో చెప్పడానికి మనమెవరం’
ఢిల్లీ: 13 ఏళ్లుగా శాశ్వత అచేతనావస్థలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్ తరఫున న్యాయవాది రష్మి నందకుమార్ వాదనలు వినిపించారు. ‘19 ఏళ్ల వయసులో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిన హరీష్ అప్పటి నుంచి కోలుకోలేదు. వందశాతం అచేతనావస్థలో ఉన్నందున కారుణ్య మరణం అనుమతించాలని కుటుంబం కోరుకుంటుంది’ అని తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని ఉపయోగింలేదు. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తుంటాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం మేమూ మనుషలమే. .. ‘ఎవరు బతికి ఉండాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని వ్యాఖ్యానించింది.వాదనలు,అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును వెలువరించే ముందు పలు అంశాలను పరిశీలించనుంది. ఆ తర్వాతే తుది తీర్పు వెలవరించనుంది. Will Supreme Court allow euthanasia for man in coma for 13 years? Verdict todayIndia allows passive euthanasia ( withdrawing life support) recognising the right to die with dignity while active euthanasia remains illegal Parents of harsh have sought passive euthanasia from… pic.twitter.com/AfTaaQhrzj— Sneha Mordani (@snehamordani) January 15, 2026


