రేపు జిల్లాలో ‘హరిత ప్రసాదం’
కడప కల్చరల్: జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అంతటా హరితప్రసాదం పేరిట భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ శాఖ అసిస్టెంట్కమిషనర్ శంకర్ బాలాజీ తెలిపారు.బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో ఎంపికచేసిన 136 దేవాలయాల ప్రాంగణాలు, ఆలయ భూములలో మొత్తం 13,600 మొక్కలను
నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18 మంది ఈఓలు ఇప్పటికే తమ పరిధిలోని ఆలయాలలో ఈకార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లలో ఉన్నారని, స్థానికుల సహకారంతో మొక్కలు నాటేందుకుఅవసరమైన వాటిని సిద్ధం చేశారన్నారు. వీలున్న ప్రతి ఆలయం వద్ద 50 నుంచి 500 మొక్కలనునాటాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా పాలకొండల్లో ఎక్కువ మొక్కలను నాటాలని భావిస్తున్నామని, పొలతలలో 400, సీకే దిన్నెలో 200, ఇంకా ఆరుబయలున్న ఆలయాల వద్ద భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పరిసరాలతోపాటు సమీపంలోఉన్న ఆలయ భూములలో కూడా మొక్కలు నాటుతామన్నారు. శుక్రవారం ఆయా దేవాలయాలకువచ్చే భక్తులకు కూడా మొక్కలను హరిత ప్రసాదంగా అందజేయనున్నామని తెలిపారు. ఆ తర్వాత
కూడా భక్తులకు మొక్కలను అందజేసేందుకు నర్సరీలతో సంప్రదిస్తామని, అవసరమైతే తమ శాఖ ఆ«ధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇందులో భాగంగా తులసి, మద్ది,మారేడు, ఉసిరి, వేప, బిల్వ, జమ్మి మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.