వ్యవసాయ మార్కెట్లో హరితహారం మొక్కల పరిశీలన
వరంగల్సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఇప్పటివరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంపై బుధవారం ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటి డైరెక్టర్, హరితహారం ప్రత్యేక అధికారి, అబ్జర్వర్ రాజశేఖర్రెడ్డి మార్కెట్లో నాటిన మొక్కలను స్వ యంగా పరిశీలించారు.
చాలా మొక్కలకు ట్రీగార్డులు లేకపోవడంతో త్వర గా ఏర్పాటు చేయాల్సింది గా మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుకు సూచించా రు. అలాగే పక్కనే ఉన్న మార్కెట్కు సంబంధించిన ముసలమ్మకుంటలో నిర్మిస్తున్న నూతన గోదాంను, సమీపంలో పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలను పరిశీ లించారు. మొత్తంగా మా ర్కెట్లో హరితహారం కార్యక్రమం విజయవంతంగా భావించి, మొక్కలు ఎదిగే వరకు ఇదే రకమైన శ్రద్ధను కనబరచాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ ముఖ్య అధికారులు రామ్మోహన్రెడ్డి, జగన్మోహన్, వెంకటేశ్వర్లు, కనకశేఖర్, రమేష్, వెంకన్న, కుమారస్వామి, రాజేందర్, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, అశోక్, సంజీవ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.