harvey
-
సమంతాకు ‘బుకర్’
లండన్: బ్రిటిష్ రచ యిత్రి సమంతా హార్వే ను 2024 బుకర్ ప్రైజ్ వరించింది. అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమ గాముల జీవితంలో ఒక్క రోజు జరిగే ఘటనలను వర్ణిస్తూ ఆమె రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘ఆర్బిటాల్’కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన తొలి అంతరిక్ష నేపథ్య రచనగా ఆర్బిటా ల్ నిలిచింది. ఈ నవలను 2023 నవంబర్‌లో ప్రచురించారు. బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడు పోయిన నవలగా నిలిచింది. అంతరిక్షపు అందాలను అద్భుతంగా కళ్లముందు ఉంచిందని జడ్జింగ్ ప్యానెల్ చైర్మన్ ఎడ్మండ్ కొనియాడారు. -
ఎందుకు సిగ్గు పడాలి: మోడల్ ఆగ్రహం
లండన్: పదికోట్లు ఇస్తే తన శరీరాన్ని వారికి అప్పగిస్తానని గతంలో చెప్పడంతో ఆమెను అందరూ అసహ్యించుకున్నారు. కానీ అదే మహిళ నేడు తన కుమారుడి కోసం తల్లిగా చేస్తున్న పోరాటాన్ని నెటిజన్లు సహృదయంతో ప్రశంసిస్తున్నారు. మూడో భర్త కీరాన్ హేలర్‌తో కలిసి ఉంటున్న బ్రిటన్ ప్రముఖ మోడల్, సింగర్ కేటీ ప్రైస్ తన జీవితంలో ఏ విషయంలోనూ సిగ్గుపడాల్సిన అంశాలే లేవన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆన్లైన్లో కుమారుడిపై వస్తున్న కామెంట్లను అరికట్టేందుకు వేసిన పిటిషన్ తాను చేసిన పనుల్లో అత్యుత్తమమైనదిగా కేటీ అభిప్రాయపడ్డారు. కుమారుడు హార్వీ (15)ని ఎప్పుడూ ఎందుకు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. హార్వీలో ఎన్నో లోపాలున్నాయని, కుమారుడి కారణంగా కేటీ ప్రైస్ ఎన్నో అవమానాలు భరిస్తున్నారని.. ఎంతో సహనంతో వాటిని ఎదుర్కొంటున్నారని మరికొందరు నెటిజన్లు ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ క్రమంలో హార్వీ గురించి తల్లి టీవీ వ్యాఖ్యాత కేటీ ప్రైస్ స్థానిక మీడియాలో చర్చిస్తూ విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'నా కుమారుడు హార్వీ ప్రాడెర్ విల్లీ సిండ్రోమ్, సెప్టో ఆప్టిక్ డిస్ప్లేసియా, ఆటిజం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అందరు తల్లుల్లాగే నేను కూడా హార్వీని టీవీ షోలకు తీసుకెళ్తున్నాను. తల్లిగా నేను చేయాల్సింది అతడికి మద్ధతుగా ఉండి ప్రేమను పంచడమే. పిల్లల లోపాలను మనం ఎత్తిచూపకూడదు. మనం ఎక్కడికి వెళ్తే వారిని కూడా తీసుకెళ్తే ఎంతో రిలాక్స్ అవుతారు. హార్వీని చూసి నేను సిగ్గుపడాల్సిన, ఆవేదన చెందాల్సిన అవసరమే లేదు. వాడి మంచితనం అందరికీ తెలియాలంటే బయటకు తీసుకెళ్లడమే ఉత్తమమని' మోడల్ కేటీ ప్రైస్ వివరించారు. -
టెక్సాస్‌లో వరద బీభత్సం..
-
టెక్సస్‌ను వణికించి హార్వీ తుఫాను
హోస్టన్: అమెరికాలోనే గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత భారీ తుఫాను టెక్సస్ రాష్ట్రాన్ని వణికించింది. హార్వీ తుఫాను సమయంలో గరిష్టంగా గంటకు 195 కి.మీ వేగంతో గాలలు వీచాయి. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే వారం రోజుల్లో 40 అంగుళాల వర్షం కురవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.