పుష్కరస్నానాకి అంతరాయం
పాన్‌గల్/వీపనగండ్ల: మండలంలోని పెద్దమరూర్ ఘాట్‌లో మంగళవారం అలలు పోటెత్తాయి. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో ఈ అలలు చెలరేగాయి. దీంతో పుష్కర స్నానాలకు దాదాపు 5గంటలపాటు అంతరాయం కలిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4గంటల వరకు స్నానాలు చేయకుండా నిలిపివేశారు. ఆలల తాకిడితో ఘాట్‌లో ఏర్పాటు చేసిన జాలీలు (కంచె)తెగిపోవడంతో గజ ఈతగాళ్లు వాటిని సరిచేశారు. దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులను చెల్లపాడు ఘాట్‌కు మళ్లించారు. అలల తీవ్రత తగ్గిన తరువాత సాయంత్రం 4 గంటల తరువాత స్నానాలకు అనుమతించారు.