విదేశీ పూలు విరిశాయి..!
నెయిల్ ఆర్ట్
ఇది ‘హవాయిన్ ఫ్లవర్స్’ నెయిల్ ఆర్ట్. ఈ హవాయిన్ ఫ్లవర్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ఫేమస్. వీటి డిజైన్స్ ఎక్కడ ఉన్నా... వాటి క్రేజే వేరు. డ్రెస్సులు, చీరలు, దుప్పట్లు... ఇలా వేటిపై ఈ ఫ్లవర్ డిజైన్ వేసినా, వాటి సేల్ విపరీతంగా పెరిగిపోతుంది. అంతటి స్పెషల్ ఫ్లవర్లను మీ గోళ్లపైనా వేసుకోవాలని ఉందా...? అయితే.. ముందుగా మీ గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, అందంగా కత్తిరించుకోండి. తర్వాత ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోండి. ఎలా అంటారా? ఇలా...
1. ముందుగా ట్రాన్స్పరెంట్, ఆరెంజ్, తెలుపు రంగుల నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని గోళ్లకూ ఆరెంజ్ కలర్ పాలిష్‌ను పూయాలి.
2. తర్వాత ఏదైనా సూది లాంటి పరికరాన్ని తీసుకొని, వైట్ కలర్ పాలిష్‌లో ముంచండి. ఆ పాలిష్‌తో ఇప్పుడు చూపుడు, మధ్య వేళ్లపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా గీయాలి.
3. ఇప్పుడు మిగతా వేళ్లకు కూడా ఫొటోలను చూసుకుంటూ వైట్ పాలిష్‌తో డిజైన్ వేసుకోవాలి.
4. సూది లాంటి పరికరం తీసుకొని, పెట్టిన తెల్ల చుక్కలను మామూలు పూరేకుల్లా మార్చుకోవాలి.
5. అదే పరికరంతో ఆ పూరేకులను హవాయిన్ పూల డిజైన్లోకి తీసుకురావాలి.
6. మళ్లీ వైట్ కలర్ పెయింట్‌తో అన్ని వేళ్లకూ అక్కడక్కడా చుక్కలు పెట్టుకోవాలి. చివరగా ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. అలా ఎంతో అందమైన పూలు మీ గోళ్లపై పూస్తాయి. ఆరెంజ్‌కి బదులుగా ఏ రంగునైనా వేసుకోవచ్చు.