hayat nagar police station
-
బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బీజేపీ నాగోల్‌లో అమరుల యాదిలో అనే సభను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన స్కీట్ వ్యవహారంలో రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయంలో నాలుగు రోజుల క్రితం జిట్టా బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు. చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్ పిలిపించి యువకుడిపై యువతి దాడి -
మహిళ మెడ నరికి హత్య
హయత్‌నగర్: దుండగులు ఓ మహిళ మెడ నరికి దారుణంగా హత్యచేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూర్‌లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. కుంట్లూర్ శివారులో నాగోలు వెళ్లే దారిపక్కన దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గమనించగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గుర్తు తెలియని దుండగులు మహిళ మెడ నరికి చంపినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి మృతురాలిని మెదక్ జిల్లా జోగిపేట మండలం యారారం గ్రామానికి చెందిన బేతమ్మ అలియాస్ లింగమ్మగా, ఆమె వయసు 45–50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. దుండగులు రెండు రోజుల కిందట హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్, డైరీలు, మద్యం సీసాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక కుంట్లూరులో ఉన్న తమ భూములను అధికార పార్టీకి చెందిన ఎంపీపీ హరిత ధనరాజ్ గౌడ్ భర్త ధనరాజ్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ.. కొందరు బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఇదే అంశంపై పోలీసులతో మాట్లాడటానికి వచ్చిన ధనరాజ్ అక్కడ ఉన్న బాధితులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
నకిలీ విలేకరులు రిమాండ్
హైదరాబాద్ : విలేకరులమని వచ్చి ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను బ్లాక్మెయిల్ చేసి రూ.25 వేలు తీసుకున్న నలుగురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అమలాపురానికి చెందిన సిలివేరు సత్యరావుప్రసాద్ మెదక్ జిల్లా బీరంగూడ రాజేంద్రకాలనీలో నివాసముంటున్నారు. పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెంకు చెందిన నేదూరి స్వామి కూకట్‌పల్లిలోని మధురానగర్‌కాలనీ, తూర్పుగోదావరి మామిడికుదురుకు చెందిన బోర్సు సాయి వెంకటదుర్గారావు వనస్థలిపురం శారదానగర్‌లో నివసిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కొరవేలు ఉజ్వల లు కలిసి నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. కుత్బుల్లాపూర్‌లో ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న సంధ్యను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 17న తమ గర్ల్‌ఫ్రెండ్‌కు అబార్షన్ చేయాలని సంధ్య వద్ద కు వచ్చారు. ఆమె అబార్షన్ చేసేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించిన సంభాషణలను వారు రికార్డు చేశారు. అనంతరం డాక్టర్ సంధ్యకు ఫోన్‌చేసి మేము న్యూస్ ఇండియా ఛానల్లో పనిచేస్తున్న విలేకరులమని చెప్పి అక్రమంగా అబార్షన్ చేస్తున్నట్లు ప్రచారం చేస్తామని బెదిరించారు. తమకు డబ్బులు ఇస్తే గుట్టు బయటపడకుండా చేస్తామని ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. దీంతో బెదిరిపోయిన సంధ్య వారికి రూ.25 వేలు ఇచ్చింది. అనంతరం వారిపై హయత్‌నగర్ పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేసింది. సంధ్య ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యరావు ప్రసాద్, నేదూరి స్వామి, సాయివెంకట దు ర్గారావు, ఉజ్వలలు టీవీ ఛానల్లో పనిచేయడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.