బెట్టింగ్ పాల్పడిన మహిళా క్రికెటర్లపై వేటు
మెల్బోర్న్: బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. హేలీ జెన్సెన్, కొరిన్నె హల్లపై రెండేళ్ల చొప్పున క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కాగా నిషేధాన్ని 18 నెలలు పాటు సస్పెండ్ చేసింది. అంటే వీరిద్దరిపై 6 నెలల చొప్పున నిషేధం అమల్లో ఉంటుంది.
హేలీ జెన్సెన్, కొరిన్నె హల్.. ఆస్ట్రేలియా జాతీయ మహిళల లీగ్, మహిళల దేశవాళీ టి-20 టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లపై పందేలు కాసినట్టు వీరిద్దరూ అంగీకరించారు. గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టినట్టు జెన్సెన్ ఒప్పుకుంది. పురుషుల దేశవాళీ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు రెండింటిపై పందెంకాసినట్టు హల్ చెప్పింది.
దక్షిణ ఆస్ట్రేలియా పురుషుల దేశవాళీ క్రికెటర్ జోయెల్ లొగన్పై కూడా బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి. లొగన్పై రెండేళ్ల నిషేధం విధించినా.. అతని మ్యాచ్ కాంట్రాక్టులను పరిగణనలోకి తీసుకుని నిషేధాన్ని పూర్తిగా సస్పెండ్ చేసింది.