శంషాబాద్ ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.