రింగింగ్ బెల్స్ మరో సంచలనం షురూ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదైన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనానికి తెరలేపిన రింగింగ్ బెల్స్ ఫ్రీడం టీవీలంటూ వినియోగదారుల ముందుకొస్తోంది. 10 వేల లోపే చీసెప్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీ అంటూ మరో సంచలనాత్మక ప్రకటన చేసింది. తమ కొత్త 'ప్రీడమ్ 9900' టీవీలకోసం ఆగస్టు 15 న బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటన చేసింది. నోయిడా ఆధారిత ఈ స్మార్ట్ ఫోన్ మేకర్ 31.5 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీల ను రూ. 9,900లకే అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది.
ఆగస్టు 15 న బుకింగ్ మొదలవుతుందనీ, తరువాతి రోజు నుంచి (ఆగస్టు 16 ) పంపిణీ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. క్యాష్ ఆన్ పద్ధతిలో వీటిని డెలివరీ చేయనున్నట్టు రింగింగ్ బెల్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1366x768 పిక్సెల్స్, రిజల్యూషన్, 3000 కాంట్రాస్ట్ రేషియో, రెండు హెచ్ డీ ఎంఐ పోర్ట్సు, రెండు యూసీబీ పోర్టులు, రెండు స్పీకర్ల తదితర ఫీచర్లు దీని సొంతం. అసక్తివున్నవారు సంస్థ వెబ్ సైట్ రింగింగ్‌బెల్స్ .కో.ఇన్ వెబసైట్ లో బుకింగ్ లు చేసుకోవచ్చు.
తమ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే తమ టెలివిజన్ కు కూడా మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తామనే భరోసా వినియోగదారులకు ఉందని పేర్కొంది.