ఏడేళ్ల బాలికపై లైంగికదాడి
గంగవరం: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గంగవరం మండలంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్‌కానిస్టేబుల్ నరసింహులు కథనం మేరకు.. మండలంలోని వుర్రివూకులపల్లెకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాల వుగించుకుని ఇంటికి వచ్చింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలాజి(20) మామిడి కాయలు ఇస్తానని చెప్పి బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు.
తలుపులు మూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతూ ఆ ఇంటి వైపు వెళ్లారు. ఇంతలో బాలాజి తలుపులు తీసి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాజిపై కేసు నమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.