మంచి ఫలితాల సాధనకు కృషి
కడప ఎడ్యుకేషన్:
వచ్చే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చేందుకు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కృషి చేయాలని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి సూచించారు. ప్రతి పాఠశాల నుంచి పదికి పది ఒకరికైనా రావాలని తెలిపారు. కడపలోని డీసీఈబీలో మంగళవారం నిర్వహించిన కడప డివిజన్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో డీఈఓ మాట్లాడారు.ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి డీప్యూటీ ఈఓ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పిల్లలందరికీ వారం వారం పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. డీసీఈబీ వారు ఇచ్చిన మెటీరియల్‌ను పిల్లలకు అందజేయాలన్నారు. చదువుతోపాటు పిల్లలను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. త్వరలో కడపలో రాష్ట్ర ఇన్‌స్పైర్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు పిల్లలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు, రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డి హెచ్ఎం సంఘం జిల్లా అ««ధ్యక్షుడు రామసుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, కడప ఎంఈఓ నారాయణ, కడప నగరపాలక విద్యాధికారి సుబ్బారెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.