head postoffice
-
హెడ్ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు
– విడుదల చేసిన పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఎట్టకేలకు కర్నూలు హెడ్ పోస్టాఫీసుకు 25 పైసల స్టాంపులు వచ్చేశాయి. వీటిని పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు మంగళవారం తన ఛాంబరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచురణ కర్తలు, పబ్లిషర్లు తమ పత్రికలను బుక్‌పోస్టు ద్వారా వేరే ప్రాంతాలకు పంపించుకునే వారని, కొన్ని నెలలుగా ఈ స్టాంపుల ముద్రణ లేకపోవడం వల్ల పోస్టాఫీసుల్లో లభించక పబ్లిషర్లు 50 పైసల స్టాంపులు అతికించి మరో 25 పైసలు నష్టపోయేవారన్నారు. ఈ అంశాన్ని సాక్షి గతంలో కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. మంగళవారం నుంచి పోస్టాఫీసుల్లో 25 పైసల స్టాంపులను అందుబాటులో ఉంచారు. స్టాంపుల విడుదల కార్యక్రమంలో సిబ్బంది నాగవెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కాకినాడ హెడ్ పోస్టాఫీస్‌పై సీబీఐ దాడి
అదుపులో పోస్టుమాస్టర్, క్యాషియర్ లెక్కల్లో రూ.25 లక్షలు తేడా పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ కాకినాడ తపాలా ఉద్యోగులు చివరకు సీబీఐకి పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి 9 గంటల వరకు కాకినాడ పోస్టాఫీస్తోపాటు కాకినాడ సాంబమూర్తినగర్, త్రీటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS వద్ద ఉన్న పోస్టల్ క్వార్టర్స్‌లోని ఇళ్లల్లో ఏకకాలంలో నలుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిం నగదు అధికారి ప్రసాద్, పోస్టుమాస్టర్ సుభాకర్లను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. -
భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ నిరసన
కాకినాడ: కేంద్ర భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ హెడ్ పోస్టాఫీసు ఎదుట గురువారం సీపీఐ జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యాలయంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లేందుకు యత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డగించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతపురం టౌన్: జైలో భరో కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్యతో పాటు ఇతర నే తలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గుంటూరు: గుంటూరులో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లోనూ సీపీఐ నిరసనలు నిర్వహించింది.