హెడ్‌ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు | 25pise stams in head post office | Sakshi
Sakshi News home page

హెడ్‌ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు

Published Wed, Apr 26 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

హెడ్‌ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు

హెడ్‌ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు

– విడుదల చేసిన పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కేవీ సుబ్బారావు
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఎట్టకేలకు కర్నూలు హెడ్‌ పోస్టాఫీసుకు 25 పైసల స్టాంపులు వచ్చేశాయి. వీటిని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కేవీ సుబ్బారావు మంగళవారం తన ఛాంబరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచురణ కర్తలు, పబ్లిషర్లు తమ పత్రికలను బుక్‌పోస్టు ద్వారా వేరే ప్రాంతాలకు పంపించుకునే వారని, కొన్ని నెలలుగా ఈ స్టాంపుల ముద్రణ లేకపోవడం వల్ల పోస్టాఫీసుల్లో లభించక పబ్లిషర్లు 50 పైసల స్టాంపులు అతికించి మరో 25 పైసలు నష్టపోయేవారన్నారు. ఈ అంశాన్ని సాక్షి గతంలో కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. మంగళవారం నుంచి పోస్టాఫీసుల్లో 25 పైసల స్టాంపులను అందుబాటులో ఉంచారు. స్టాంపుల విడుదల కార్యక్రమంలో సిబ్బంది నాగవెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement