కాకినాడ: కేంద్ర భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ హెడ్ పోస్టాఫీసు ఎదుట గురువారం సీపీఐ జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యాలయంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లేందుకు యత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డగించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.
అనంతపురం టౌన్: జైలో భరో కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్యతో పాటు ఇతర నే తలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
గుంటూరు: గుంటూరులో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లోనూ సీపీఐ నిరసనలు నిర్వహించింది.