health critical condition
-
ఎన్డీ తివారీ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు నారాయణ్ దత్ తివార్(92) ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తివారీని కుటుంబసభ్యులు గత ఏడాది సెప్టెంబర్ 20న ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాలు పనిచేయక పోవటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని రావత్ చెప్పారు. మంగళవారం ఆస్పత్రికి చేరుకున్న రావత్.. తివారీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలు పనిచేయడం లేదనీ, కడుపులో ఇన్ఫెక్షన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తివారీ కొడుకు చెప్పారు. తివారీ మూడుసార్లు ఉత్తరప్రదేశ్‌కు, ఒకసారి ఉత్తరాఖండ్‌కు సీఎంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్ (87) ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎంఎస్ విశ్వనాథన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఎంఎస్ విశ్వనాథన్‌ను కుటుంబసభ్యులు రెండు వారాల క్రితం అడయార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆర్యోగం కాస్త మెరుగుపడింది. దీంతో ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తామని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎంఎస్ విశ్వనాథన్ తీవ్ర అనారోగ్యం గురయ్యారు. దాంతో ఆయన్ని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంఎస్ విశ్వనాథన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన శిష్యులు, సంగీత జ్ఞాని ఇళయరాజా, ఎస్బీ బాలసుబ్రమణ్యం ఆయన్ని పరామర్శించారు.