ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం | MS Viswanathan health critical condition | Sakshi
Sakshi News home page

ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం

Published Wed, Jul 8 2015 9:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం

ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్ (87) ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎంఎస్ విశ్వనాథన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.  శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఎంఎస్ విశ్వనాథన్ను కుటుంబసభ్యులు రెండు వారాల క్రితం అడయార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

కాగా ఆయన ఆర్యోగం కాస్త మెరుగుపడింది. దీంతో ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తామని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎంఎస్ విశ్వనాథన్ తీవ్ర అనారోగ్యం గురయ్యారు. దాంతో ఆయన్ని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంఎస్ విశ్వనాథన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన శిష్యులు, సంగీత జ్ఞాని ఇళయరాజా, ఎస్బీ బాలసుబ్రమణ్యం ఆయన్ని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement