health diseases
-
పాప్ కార్న్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?
-
వ్యాధులపై అవగాహన పెరగాలి
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: వ్యాధుల సమర్థ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడం ఒక్కటే మేలైన మార్గమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం) అవిశ్రాంత కృషి చేస్తోందని కొనియాడారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. సామాజిక, ఆర్థిక అంశాల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో పరిశోధించే సోషల్ మెడిసిన్ రంగాల్లో ఐఏపీఎస్ఎం పనిచేస్తోంది. ఐఏపీఎస్ఎం ఏర్పాటై 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రి, జాతీయ పోషకాహార సంస్థ సంయుక్తంగా ‘ఐఏపీఎస్ఎంకాన్’పేరుతో సదస్సును నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సు గురువారం ఎన్ఐఎన్లో ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ఐఏపీఎస్ఎం వంటి సంస్థలు, ప్రజారోగ్య సిబ్బంది కీలకపాత్ర పోషించారని అన్నారు. వ్యాధుల గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సి చర్యలు.. అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త చికిత్స పద్ధతులను జన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు ఐఏపీఎస్ఎం మరింత కృషి చేయాలని సూచించారు. ప్రజలకు దీనిపై అవగాహన ఏర్పడితే సమస్య సగం పరిష్కారమైనట్లేనని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమస్య దాదాపుగా సమసిపోయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సాంక్రమిక వ్యాధులు మరికొన్నింటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చని గవర్నర్ హెచ్చరించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య, మరికొన్ని చోట్ల మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. ఇలా వివిధ ప్రాంతాల్లో వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయో పరిశోధించాలని గవర్నర్ కోరారు. యంగెస్టు స్టేట్‌కు యంగ్ గవర్నర్‌ను ‘భారతదేశంలోనే యంగెస్టు స్టేట్ తెలంగాణ. దానికి దేశంలోని అందరు గవర్నర్లతో పోలిస్తే నేనే యంగ్ గవర్నర్’అని గవర్నర్ తమిళిసై అన్నారు. నూతన రాష్ట్రాన్ని నూతన గవర్నర్ ఏవిధంగా మెనేజ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారని, అయితే తాను వృత్తి రీత్యా గైనకాలజిస్టును అయినందున కొత్తగా పుట్టిన బిడ్డను ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నానని పేర్కొన్నారు. పైగా పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నానని.. దీంతో తాను కవల పిల్లలను చూసుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నానని వివరించారు. ఐఏపీఎస్ఎంకాన్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ వికాస్ భాటియా, ఉపాధ్యక్షురాలు డాక్టర్ రష్మీ కుందాపూర్, ఐఏపీఎస్ఎం ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ ఎ.ఎం.ఖాద్రీ పాల్గొన్నారు. -
ఎన్సీడీ సమస్య?.. 35 ఏళ్లు నిండినవారికి అనారోగ్యం తప్పదా? ఎందుకిలా?
ఎన్సీడీ.. సందేహం వద్దు. ఓసీడీ కాదు, ఇది ఎన్సీడీ. అంటే...నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ). ఆధునిక జీవనశైలిలో మన చుట్టూ పొంచి ఉన్న అనారోగ్యాల సమూహం ఇది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు, కానీ ఒక దగ్గర, ఒక వాతావరణంలో పనిచేసే వారికి ఏకకాలంలో ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు నిండితే చాలు... నేనున్నానంటూ ఈ సమూహంలోని ఏదో ఒక అనారోగ్యం తొలుత పలకరిస్తుంది. ఆ తర్వాత మరిన్ని అనారోగ్యాలకు మార్గాలను సుగమం చేస్తుంది. మనదేశంలో ఏడాది కిందట ‘ఇల్నెస్ టూ వెల్నెస్’ ప్రచారంలో భాగంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ముప్పై ఐదేళ్లు నిండిన వారిని ఏదో ఒక ఎన్సీడీ అనారోగ్యం వేధిస్తోంది. వాటిలో హైపర్ టెన్షన్, డైజెస్టివ్ డిసీజెస్, డయాబెటిస్ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయి. క్యాన్సర్ కూడా ఈ ఎన్‌సీడీల్లో ఉంటోంది. కానీ దాని శాతం అత్యంత తక్కువగానే ఉన్నట్లు ‘ఇల్నెస్ టూ వెల్నెస్’ నివేదిక సమాచారం. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారి) సంయుక్తంగా నిర్వహించిన ‘ఇల్‌నెల్ టూ వెల్నెస్’ సర్వేలో 21 రాష్ట్రాల్లో రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా వ్యక్తులను సంప్రదించారు. సమతుల్యత లోపించిన ఆహారం, ఆల్కహాల్ సేవనం, ధూమపానం ప్రత్యక్ష కారణాలవుతున్నాయి. వీటికి దారితీస్తున్న పరోక్ష కారణాల మీద కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి, తక్షణ ఉపశమనం కోసం కొంతమంది విపరీతంగా ఆహారం తీసుకుంటున్నారు. అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కాదు. జిహ్వకు రుచి కోసం, మెదడుకు సంతృప్త భావన కోసం ప్రాసెస్డ్ షుగర్స్‌తో చేసిన జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కొద్ది నెలల్లోనే దేహం సెంట్రల్ ఒబేసిటీ (నాభి వలయం చుట్టు కొలత పెరగడం) కి లోనవడం జంక్‌ఫుడ్ వల్లనేనంటారు నిపుణులు. దీనికి తోడు వ్యాయామం తగ్గిపోవడం కూడా కారణమే. ఇక వర్క్ షెడ్యూళ్లు, పని వాతావరణాలు మెదడు, నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇవి హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు దారి తీస్తున్నాయి. యాభై ఏళ్ల కిందట ఎన్సీడీ సమస్యలు ఇప్పటికిప్పుడు ఊడిపడిన అనారోగ్యాలు కాదు, కానీ ఇప్పుడు వాటి శాతం ఏడాదికేడాదికీ గణనీయంగా పెరుగుతోంది. 1970 దశకంలో రెండు శాతం ఉంటే ఇప్పుడు 35 నుంచి 40 శాతంగా ఉంది. ఇది ఇలా ఉంటే... స్ట్రోక్ (పక్షవాతం) కేసులు గడచిన ముప్పై ఏళ్లలో గణనీయంగా పెరుగుతున్నాయని న్యూఢిల్లీలోని ‘లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్’ న్యూరాలజీ హెవోడీ ప్రొఫెసర్ డాక్టర్ రాజిందర్ కె ధమిజ తెలియచేశారు. వృత్తిఉద్యోగవ్యాపారాల్లో రోజుకు ఎంత ఉత్పాదకతను సాధించామనే గణనతోపాటు రోజుకు ఎంత ఆహారం తింటున్నాం, ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామోననే స్పృహ కలిగి ఉండడం, అలాగే ఎంత వ్యాయామం చేశామనే ఆలోచన కూడా ఉండాలి. ఎన్సీడీ సమస్యలతో ఎదురయ్యే తదనంతర పరిణామాలను నివారించాలంటే ముప్పైలలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఒత్తిడి నుంచి బయటపడడానికి ధూమపానం, ఆల్కహాల్‌కు బదులుగా రోజూ జిమ్ లేదా ఇతర ఫిజికల్ యాక్టివిటీ, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను ఆశ్రయించడం ఆరోగ్యకరం. -
చిగురుటాకులా.. నూరేళ్ల ఆయుష్షు
ఆడే పాడే వయస్సు.. చలాకీగా గడపాల్సిన ప్రాయం.. బడికిపోదామంటే భయం భయం.. చేయి కదపలేడు.. రాత రాయలేడు.. ఆడుకుందామంటే ఆందోళన.. తనకేమవుతుందోననే భయం.. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే మెడపై ఏర్పడిన గడ్డ (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్)అతన్ని కదలనీయకుండా చేస్తోంది. చేయి కదిలిస్తే నొప్పితో నరకయాతన. ప్రాణం పోయేంత బాధ. చీపురు పుల్ల తగిలినా గిలగిలా కొట్టుకుంటాడు. వైద్యులు మాత్రం ఆపరేషన్ చేసినా ఆయుష్షుకు గ్యారెంటీ లేదంటున్నారు. వైద్యం చేయించలేని నిరుపేద తల్లిదండ్రుల స్తోమత. కంటికి రెప్పలా కాపాడుకోకపోతే తమ బిడ్డ బతకడేమోనన్న మానసిక వేదన. వెరసి పదిహేనేళ్లుగా ఓ గిరిజన విద్యార్థి బతుకు దినదినగండంలా మారింది. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం గిరిజన కాలనీకి చెందిన నాని నరకయాతన చూస్తే ఎవరైనా కన్నీరు పెడతారు. సాక్షి, నాయుడుపేట: నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాళెం పంచాయతీ శ్రీనివాసపురం గిరిజనకాలనీకి చెందిన సత్యేటి వెంకటరమణయ్య – మరియమ్మలకు ముగ్గురు కుమారులు. తొలి సంతానం సత్తేటి నాని. నానికి పురిటి బిడ్డగా ఉన్న సమయంలోనే మెడపై గుండ్రని కణిత ఏర్పడింది. అప్పట్లో వైద్యులు గడ్డను చూసి ఆపరేషన్ చేస్తే బిడ్డకు ప్రమాదమని చెప్పారు. చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. నానిని స్వగ్రామమైన జువ్వలపాళెం ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివించారు. 9వ తరగతిలో చేరేందుకు సమీప పాఠశాలల్లో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నారు. వసతి గృహంలో చేరాలంటే కణితకు చీపురపుల్ల తగిలినా గిలగిలకొట్టుకుంటూ పడిపోతాడు. ఈ అనారోగ్య కారణంతో వసతి గృహాల్లో చేర్చలేక దూరంగా చదివించలేక తల్లిదండ్రులే భారం మోస్తున్నారు. సమీప పాఠశాలలో చదివించుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేలా తమ బిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. సెంటు భూమి లేని ఈ గిరిజన కుటుంబం కార్పొరేట్ వైద్యం అందించలేని పరిస్థితిలో ఉంది. కార్పొరేట్ వైద్యం అందించాలంటే పెద్ద మొత్తంలో నగదు చెల్లించుకోవాల్సి ఉంది. అంత స్తోమత లేని ఈ కుటుంబం ప్రభుత్వ వైద్యశాలల్లో మెడపై ఉన్న కణితను చూపుతూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు 15 ఏళ్లుగా కాలం వెల్లదీస్తూ వచ్చారు. ఈ క్రమంలో 9వ తరగతిలో చేరాలంటే దూర ప్రాంతాల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బిడ్డను అలా చేర్పిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని మదనపడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంటి వద్దనే ఉంచారు. చేయూతనివ్వని గత ప్రభుత్వాలు పదేళ్లుగా ప్రభుత్వాల నుంచి వారు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నారు. మెడపై గడ్డ కారణంగా కుడిచేయి పైకి లేపలేకపోవడంతోపాటు రోజురోజుకూ చేయి సన్నగిల్లుతోంది. దీని కారణంగా మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న ఆ విద్యార్థికి సదరం క్యాంపులో ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే పెన్షన్ కూడా అందడం లేదు. చేయి కదపలేక, పనిచేసుకోలేక, రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థికి వైద్యశాఖ అధికారులు సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడం బాధాకరమని ఆ గిరిజన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులైనా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నాని మెడపై ఉన్న గడ్డ, చేయి కదపలేని పరిస్థితిలో నాని గడ్డ పెరిగే కొద్ది భయమేస్తుంది పురిటి బిడ్డ నుంచే ఉన్న చిన్నపాటి కణిత రోజురోజుకూ పెరుగుతోంది. పెరిగే కొద్ది భయమేస్తోంది. కొంతమంది వైద్యులు ఆపరేషన్ చేస్తే ప్రమాదమని చెబుతున్నారు. మరికొంతమంది వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంతో కణితను తీసి మామూలు మనిషిని చేస్తారని చెబుతున్నారు. ఉన్న ముగ్గురు బిడ్డలను పోషించేందుకే మా జీవితం సరిపోతోంది. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో డబ్బు పెట్టాలంటే మాకు స్థోమత లేదు. ప్రభుత్వ వైద్యులు మాకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు. – సత్తేటి మణెమ్మ, నాని తల్లి చదువుకోవాలని ఉంది నాకు చదువుకోవాలని ఉంది. మంచి చదువులు చదివి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నా. కానీ నా మెడపై పెరుగుతున్న గడ్డ కారణంగా రాత్రి పడుకున్న సమయంలో నొప్పికి అల్లాడిపోతున్నా. పాఠశాలకు వెళ్లిన సమయంలో స్నేహితులతో కలిసి ఆటలాడలేకున్నా. చదువుపై దృష్టి పెట్టాలంటే ఆరోగ్యం సహకరించడం లేదు. – సత్తేటి నాని, విద్యార్థి -
విషకౌగిలి
కాలుష్యపు కోరల్లో గోళ్లాపురం జనం ప్రాణాలు తీస్తున్న పరిశ్రమలు కన్నెత్తి చూడని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రత్యామ్నాయం చూపడంలో జిల్లా యంత్రాంగం విఫలం తమ ఊరి వద్ద పారిశ్రామికవాడ వస్తోందంటే వారంతా సంతోషించారు. ఉద్యోగాలు, ఉపాధి స్థానికంగానే లభిస్తాయని ఆశించారు. తమ బతుకులు బాగుపడతాయనుకున్నారు. అయితే.. ఇవే పరిశ్రమలు తమ ఉసురు తీస్తాయని ఆనాడు ఊహించలేకపోయారు. పారిశ్రామిక విషకౌగిలిలో చిక్కుకుని ప్రస్తుతం విలవిలలాడుతున్నారు. ఇక్కడ ఉండలేక, వేరే ప్రాంతానికి తరలివెళ్లలేక హిందూపురం శివారులోని గోళ్లాపురం వాసులంతా నలిగిపోతున్నారు. హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణ శివారులోని గోళ్లాపురం గ్రామం 1,790వ సంవత్సరంలోనే ఏర్పడింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 621 ఇళ్లు ఉన్నాయి. జనాభా 2,625 మంది. ఈ ఊరి వద్ద 1985లో అప్పటి ముఖ్యమంత్రి, హిందూపురం ఎమ్మెల్యే ఎన్టీ రామారావు పారిశ్రామికవాడను ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామం చుట్టూ వందకు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటిలో ఐరన్‌ఓర్, ఐరన్ స్క్రాబ్æ, రసాయనిక మందులు, వాయువుల తయారీ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వాయువులు, వ్యర్థాల వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పటికే పంట పొలాలు దెబ్బతిన్నాయి. బోరుబావుల్లో కలుషిత నీరు వస్తోంది. గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. పురిటి బిడ్డలు, పెరిగే చిన్నారులపై సైతం కాలుష్య ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పలువురు క్షయ, కేన్సర్, చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. పిల్లలు బుద్ధిమాంద్యులు గాను, కాళ్లు చచ్చుబడి అవిటివారు గాను మారుతున్నారు. గర్భస్రావాలు అవుతుండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. వీరేం చేశారు పాపం! గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ పెద్దకుమారుడు వరణ్ వయసు 20 ఏళ్లు. కాళ్లూ చేతులు చచ్చుబడిపోయాయి. బుద్ధిమాంద్యం కూడా ఉంది. వెంకటేష్ కుమారుడు చరణ్ నడుము, కాళ్లూ చేతులు చచ్చుబడి, మాటలు రాక అవిటివాడయ్యాడు. అదినారాయణ కుమారుడు పదేళ్ల వెంకటేష్ కూడా బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నాడు. ఇరవై ఏళ్ల అశ్విని కాలుచేయి వంకరతో వికలాంగురాలిగా మారింది. వీరే కాకుండా పలువురు శ్వాసకోస వ్యాధులు, వణుకుడు రోగం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా.. పరిశ్రమల్లో వారికేమైనా ఉద్యోగాలు, ఉపాధి లభించాయా అంటే అదేమీ లేదు. పరిశ్రమల యజమానులు ఎక్కువగా స్థానికేతరులనే పనుల్లో పెట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన పనులు చేయిస్తుండటంతో ఏదైనా జరిగినప్పుడు స్థానికులైతే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తీర్మానాలు, ఫిర్యాదులు చేసినా.. పారిశ్రామిక కాలుష్య ప్రభావం గోళ్లాపురంతో పాటు తూమకుంట, పెద్దగుడ్డంపల్లి గ్రామాలపైనా ఉంది. ఈ విషయాన్ని జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ రెండేళ్లుగా జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. జెడ్పీ చైర్మన్ చమన్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. అలాగే తూమకుంట, గోళ్లాపురం గ్రామపంచాయతీ సర్పంచులు లక్ష్మమ్మ, నాగార్జున స్థానికులతో కలిసివెళ్లి కర్నూలులోని కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏడీ రెండు రోజుల పాటు పరిశ్రమలలో తనిఖీలు చేసి వెళ్లారు. అయితే..ఎలాంటి చర్యలూ లేవు. యాజమాన్యాల ఇష్టారాజ్యం పరిశ్రమల యజమానులు కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. సామాజిక బాధ్యత కింద పర్యావరణ పరిరక్షణకూ చొరవ చూపడం లేదు. దీంతో స్థానికులు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడు వచ్చి హడావుడి చేసే అధికారులు..ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. గతంలో వారొచ్చి తీసుకెళ్లిన నీరు, మట్టి, ఇతరత్రా నమూనాల ఫలితాలు ఎలా వచ్చాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అధికారులకు చెప్పిచెప్పి అలసిపోయామని, ఇక మీదట ఫిర్యాదులు చేసే ఓపిక కూడా తమకు లేదని గ్రామస్తులు చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పరిశ్రమల నిర్వాహకులు ప్రతినెలా గ్రామంలో వైద్యపరీక్షలు నిర్వహించాలి. ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అలాగే శుద్ధమైన నీరు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇవేవీ గోళ్లాపురంలో కన్పించడం లేదు. రాత్రి 12 తర్వాత ఊపిరాడదు –లక్ష్మినరసమ్మ, గోళ్లాపురం రాత్రి 12 తర్వాత పరిశ్రమల నుంచి భారీఎత్తున పొగ వదులుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా దుర్వాసన భరించలేం. దీనికితోడు నీళ్లు రుచి మారిపోతున్నాయి. ఒక్కొక్కసారి రంగు మారిన నీరు వస్తోంది. గత్యంతరం లేక హిందూపురం నుంచి వస్తున్న శుద్ధజలాన్ని కొంటున్నాం. గ్రామంలో దొరికే నీటిని ఇతర అవసరాలకు మాత్రమే వాడుతున్నాం. పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి–ఆదిలక్ష్మి, గోళ్లాపురం పారిశ్రామిక కాలుష్యం చిన్నారులకు ప్రాణాంతకంగా తయారైంది. చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్నారు. వారు పడుతున్న బాధ చూడలేకపోతున్నాం. ఇక్కడ చాలామంది కూలి పనులు చేసుకునే వారే. అచేతనంగా పడిఉన్న పిల్లలను ఇంటివద్ద ఉంచి పనులు వెళ్లాల్సివస్తోంది. వారు నోరు తెరిచి నీళ్లు, ఆహారం అడగలేరు. తల్లులే అర్థంచేసుకుని అన్నం పెట్టాలి. ఇంత దారుణమైన పరిస్థితులున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. -
ఇది ఉంటే ఆరోగ్యానికి ఢోకా లేదు!
మనకు వచ్చే సగం ఆరోగ్య సమస్యలు ఆహారం వల్లే వస్తాయంటారు వైద్యులు. ముఖ్యంగా నూనె, నెయ్యి, డాల్డా వంటి వాటి వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. అది తెలిసి కూడా మనం వాటిని పక్కన పెట్టేయలేం. ఎందుకంటే... పొయ్యి మీద చేసే వంటకు వీటిలో ఏదో ఒకటి ఉండాలి. లేదంటే వేపుడు మాడిపోతుంది. కూర గిన్నెకు అంటుకుపోతుంది. అందుకే వాటిని కాస్త ఎక్కువగానే తగిలిస్తుంటాం. అదే మన దగ్గర బీబీక్యూ ఉందనుకోండి... అలాంటి సమస్యా ఉండదు. మన ఆరోగ్యానికి ఢోకానూ ఉండదు! అయితే బీబీక్యూలు అంత తక్కువ ధరకేమీ దొరకవు. మూడు నాలుగు వేలు పెట్టాల్సిందే. అంత పెట్టడం కష్టం అనుకుంటే ఈ మినీ బీబీక్యూని కొనుక్కోవడం మంచిది. దీని వెల రెండు వేల లోపే. ఆన్లైన్లో అయితే రూ. 1360 నుంచి మొదలవుతోంది. దీనికి నూనెతో పని ఉండదు. కూరగాయల దగ్గర్నుంచి మాంసం, చేపలు, రొయ్యల వరకూ అన్నిటినీ దీనిమీద చక్కగా కాల్చుకోవచ్చు. బోలెడన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టనూ వచ్చు!