బాస్మతి బియ్యం బస్తాకు గిన్నిస్ రికార్డు
భారతదేశానికి చెందిన 550 కేజీల బియ్యం బస్తా.. గిన్నిస్ పుటలకెక్కింది. ప్రఖ్యాత బ్రాండ్‌గా పేరొందిన ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతి బియ్యం బస్తా.. గల్ఫుడ్-2016 లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని... గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.
ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం మిల్లర్లు, బాస్మతి బియ్యం ఎగుమతిదారులు అయిన ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతి రైస్ బ్రాండ్ వ్యాపారులు అతి పెద్దబ్యాగ్ లో 550 కేజీల బియ్యాన్ని నింపి ఈ రికార్డు సాధించారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు దుబాయ్ లో జరిగే ప్రదర్శనలో ఇండియాకు చెందిన కేఆర్‌బీఎల్ లిమిటెడ్, బాస్మతి రైస్ ఎగుమతి బృందం ప్రదర్శనకు అల్ ఖోజ్ గిడ్డంగి నుంచి ట్రక్కులో తెచ్చిన 550 కేజీల బాస్మతి బియ్యాన్ని ఓ అతిపెద్ద బస్తాలో నింపి కొత్త రికార్డు సాధించారు.
ఎగ్జిబిషన్ ముగిసిన తర్వాత రికార్డు సాధించిన బియ్యం బస్తాను షాపింగ్ మాల్ లో కానీ, ఏదైనా పెద్ద రిటైల్ స్టోర్ లో కానీ కొన్నాళ్ల పాటు ప్రదర్శనకు ఉంచి, తర్వాత కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు మిట్టల్ వెల్లడించారు.