అకోలాలోని చమురు కర్మాగారంలో అగ్నిప్రమాదం
ముంబై : మహారాష్ట్ర అకోలాలోని హీరా చమురు కర్మాగారంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. కర్మాగారం భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. 15 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అగ్నిప్రమాదానికి గల కారణాలపై భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.