Heli Tourism
-
9 నుంచి గగన విహారం
సాక్షి, అమరావతి: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో హెలీ టూరిజం ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశంలో విహరిస్తూ నగర అందాలు వీక్షించే అవకాశం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర పర్యాటకశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) సంయుక్తంగా హెలీ రైడ్స్ ఏర్పాటు చేశాయి. దసరా సందర్భంగా భక్తులు, పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో హెలీ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున హెలిప్యాడ్ ఏర్పాటుకు వీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, కోటప్పకొండ, కొండపల్లి, కొండవీడుల్లో హెలీ టూరిజం నిర్వహించగా విజయవాడలో మొదటిసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండు కేటగిరీల్లో ఫ్లై జాయ్ టికెట్లు కృష్ణానది పైనుంచి విహరిస్తూ జలనిధి అందాలతో పాటు మబ్బుల మాటునుంచి ఇంద్రకీలాద్రి వైభవం, బెజవాడ నగర సోయగాలను వీక్షించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం హెలీ టూరిజంలో విశేష అనుభవం గడించిన తుంబై ఏవియేషన్ సంస్థ ఆరుగురు ప్రయాణించేందుకు వీలుండే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను అందుబాటులోకి తేనుంది. రెండు కేటగిరీల్లో అందించే ఈ హెలీ రైడ్స్‌కు ప్రాథమికంగా టికెట్ రేట్లను నిర్ణయించారు. ఆకాశం నుంచి ఇంద్రకీలాద్రి మీదుగా ప్రకాశం బ్యారేజీ, నగర అందాలను వీక్షించేందుకు 6 నుంచి 7 నిమిషాల ప్రయాణానికి రూ.3,500 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. దుర్గగుడి ఏరియల్ వ్యూ, నగరంలోని హిల్స్ అందాలను వీక్షించేందుకు 15 నిమిషాల ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.6 వేలు వసూలు చేయనున్నారు. ఈ ఫ్లై జాయ్‌ని ప్రోత్సహించడానికి సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాల్లో ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల స్పందనను బట్టి టికెట్ ధర తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. టూరిజాన్ని ప్రోత్సహించేలా.. రాష్ట్రంలో టూరిజాన్ని విస్తరించి, మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ క్రమంలోనే విజయవాడలో తొలిసారిగా హెలీ టూరిజాన్ని తీసుకొస్తున్నాం. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాం. ఏర్పాట్లపై కృష్ణాజిల్లా కలెక్టర్, వీఎంసీ కమిషనర్లతో చర్చించాం. – ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
సంక్రాంతి కానుక... గగన విహారం
నేటి నుంచి మళ్లీ హెలీ టూరిజం 17వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్: నగరవాసులకు సంక్రాంతి కానుకగా టూరిజం శాఖ అధికారులు హెలీ టూరిజాన్ని మళ్లీ పునరుద్ధరించారు. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, సాగర్ మధ్యలో ఉండే తథాగతుడిని వీక్షించి అక్కడికి కాస్త దూరంలో ఉండే బిర్లా మందిర్, శాసనసభా ప్రాంగణం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట పరిస రాలు... హైటెక్ సిటీ, సైబరాబాద్‌లోని ఐటీ భవనాలన్నింటినీ నిమిషాల్లో వీక్షించాలను కునేవారికి ఇదో అవకాశం. గత ఏడాది మార్చి ఒకటిన నెక్లెస్ రోడ్డు, జలవిహార్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం లో హెలీటూరిజం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. కొంతకాలం నడిచాక ఉపరాష్ట్ర పతి నగరానికి వచ్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించి, ఏవియేషన్ అధికారులు అనుమతులు నిరాకరించారు. దానికితోడు బుకింగ్ పొరపాట్ల కారణంగా పర్యాటకులు ఆసక్తి చూపకపోవటంతో గగన విహారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అనుమతులను పొందారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తుంబే ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఒప్పించి హెలీటూరిజం ప్రారంభమయ్యేలా చేశారు. ఐదురోజులే ఈ అవకాశం... ఈ హెలీ టూరిజాన్ని ఐదురోజులకే పరి మితం చేశారు. 13 నుంచి 17 వరకు సాగు తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హెలీకాప్టర్ తిరుగు తుంది. ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్ ధర చెల్లించాలి. నలుగురు కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ.3 వేలు, 12 మంది కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 చెల్లించాలి. మేరా ఈవెంట్స్ డాట్ కామ్‌లో బుకింగ్ చేసుకోవాలి. -
నేటి నుంచి నగరంలో హెలీ టూరిజం
హైదరాబాద్: న్యూయార్క్ , లండన్ లాంటి నగరాల్లో మాదిరిగా ఇకపై హైదరాబాద్ నగరంలో కూడా పర్యాటకులకు విహంగ విహారం అవకాశం దక్కనుంది. హెలిక్యాప్టర్ లో ప్రయాణిస్తూ హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, సరస్సులు, ఇతర ఆకర్షణలను తిలకించే సదవకాశం మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నది. ‘హెలిటూరిజం ఇన్ హైదరాబాద్’ అనే కొత్త ఈవెంట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - ఇండివెల్ ఏవియేషన్ సంయుక్త నిర్వహణలో తెరలేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ప్రజలు, పర్యాటకులు కూడా ఇకపై హైదరాబాద్ నగరంపై హెలిక్యాప్టర్‌లో తిరగవచ్చు. ఈ జాయ్ రైడ్ తొలి రైడ్ ను మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం పది గంటలకు నగరంలోని నెక్లెస్ రోడ్డులో ప్రారంభించనున్నారు. ఒక్కో టూరిస్టుకు రూ.3499 చార్జీగా తీసుకుంటారు. ఒకే సారి నలుగురు టూరిస్టులు ప్రయాణించవచ్చు. నెక్లెస్ రోడ్డు, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, హైటెక్ సిటీ, దుర్గం చెరువు తదితర ప్రాంతాలను ఈ జాయ్ ట్రిప్ ద్వారా చుట్టి రావచ్చు. -
నగరంలో హెలీ టూరిజం
హైదరాబాద్ : మార్చి 1వ తేదీ నుంచి హైదరాబాద్‌లో హెలీ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నెక్లెస్ రోడ్లో హెలీ టూరిజంను ప్రారంభించనున్నారు. గగన తలం నుంచి నగరంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేలా సరికొత్త ప్యాకేజీని రూపొందించారు. ఇండ్ వెల్ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీసులు ఈ సేవలను అందించనున్నాయి.