జ్యోత్స్నకు కొనసాగుతున్న సాయం
సాక్షి కథనానికి స్పందన
హస¯ŒSబాద(రామచంద్రపురం రూరల్) :
అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల జ్యోత్స్నకు దాతలు విరాళాలు సమర్పిస్తున్నారు. రామచంద్రపురం మండలం హస¯ŒSబాదకు చెందిన ఏడేళ్ల బాలిక వాసంశెట్టి జ్యోత్సS్న సమస్యను సాక్షిలో సెప్టెంబరు 28న ప్రచురితమైంది. ఈ కథనం విస్తృతంగా ప్రచారం కావడంతో జ్యోత్స్నకు మానవతావాదుల విరాళాలు కొనసాగు తూనే ఉన్నాయి. కథనం ప్రచురితమైన వెంటనే విజయనగరం నుంచి ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధులు వచ్చి వీల్‌చైర్‌తో పాటు నగదు అందజేశారు. అలాగే చిన్నారి బ్యాంకు ఖాతాలో దాతలు సొమ్మును జమ చేస్తున్నారు. బ్యాంకులో ఇప్పటికి రూ. 48 వేలు జమ కాగా, కొంత మంది స్వయంగా వచ్చి సాయం అందజేస్తున్నారు. బిక్కవోలు కు చెందిన వంగా సూర్యప్రకాశరెడ్డి అలియాస్ ఎడ్ల పందాలు సూరిబాబు రెడ్డి, తనకు సన్నిహితులైన బిక్కవోలుకు చెందిన నందిపాటి వీరవెంకట సుబ్బారెడ్డి రూ. 1000, పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు దాతలు రూ. 2 వేలు, గొల్లలమామిడాడకు చెందిన సబ్బెళ్ల రామలక్ష్మణులు రూ. 4 వేలు, సత్తి శ్రీనివాసరెడ్డి రూ. 2000, నల్లమిల్లి ఈశ్వరరెడ్డి రూ. 5 వేలు, బలభద్రపురానికి చెందిన కొవ్యూరి సతీష్‌రెడ్డి రూ. 2500, నల్లమిల్లికి చెందిన పాస్టర్ శామ్యూల్ రాజు రూ. 1000, సంపరకు చెందిన మడిచర్ల కొండబాబు రూ. 1000, సొమ్ములకు తను స్వయంగా రూ. 1000 చేర్చి మొత్తం రూ. 19,500లు హస¯ŒSబాదలో శనివారం హస¯ŒSబాదలో జ్యోత్స్న ఇంటికి వచ్చి అందజేసారు. వీరు కాక బొమ్మూరుకు చెందిన స్వరాజ్య లక్ష్మి రూ. 5 వేలు, రాయవరానికి చెందిన మల్లిడి హరనాథరెడ్డి రూ.10 వేలు, రావులపాలెం చిన్నారెడ్డి రూ. 1000 చిన్నారికి ఇచ్చినట్లు పాప తల్లిదండ్రులు వరలక్ష్మి, వెంకటరమణలు తెలియజేసారు. శక్రవారం రామచంద్రపురం పట్టణానికి చెందిన డోనర్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లు సంయుక్తంగా రూ.25 వేలు జ్యోత్స్నకు అందించిన విషయం పాఠకులకు విదితమే.
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును కలవగా ఎన్ని లక్షలు ఖర్చయినా వైద్యం చేయించేందుకు తాను సహకరిస్తానని మాటివ్వడంతో పాటు రూ.10 వేలు సహాయం అందజేసారని తండ్రి వెంకటరమణ తెలిపారు. సహకరిస్తున్న దాతలకు, తమ సమస్యను వెలుగులోనికి తెచ్చిన సాక్షికి ఎంతైనా రుణపడి ఉంటామని జ్యోత్స S్న తల్లిదండ్రులు పేర్కొన్నారు.