హేమంత్ గాడ్సేపై కేసు
నాసిక్: నాసిక్ లోక్సభ స్థానం నుంచి శివసేన తరఫున బరిలోకి దిగుతున్న హేమంత్ గాడ్సేతో పాటు స్థానిక నాయకులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. తమ అనుమతి తీసుకోకుండా గాడ్సేకు స్వాగతం పలికేం దుకు సేన జిల్లా అధ్యక్షుడు విజయ్ కరంజ్కార్ ఆధ్వర్యంలో 150 మంది కార్యకర్తలతో ద్విచక్ర వాహన, కారు ర్యాలీ నిర్వహించారని పోలీ సులు తెలిపారు.
నాసిక్ నుంచి గాడ్సే అభ్యర్థిత్వాన్ని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన అనంతరం ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై-అగ్రా జాతీయ రహదారికి సమీపంలోని నగర పత్రాడి-పాటా ప్రాంతంలో కరంజ్కార్తో పాటు ఇతరులు ర్యాలీ నిర్వహించారని వివరించారు. వీరిపై ఐపీసీ 188 సెక్షన్, ముంబై పోలీసు చట్టం 135 సెక్షన్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.