hemanth reddy
-
ఎయిర్‌గన్‌తో యువకుడు హల్చల్..అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఎయిర్‌గన్‌తో హల్చల్ సృష్టించాడు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థి హేమంత్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఎయిర్‌గన్‌తో పలువురిని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఎయిర్‌గన్‌తో పాటు 12 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు
విజయవాడ: ఓ ఎన్నారై యువతి విజయవాడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడి కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె విజయవాడ వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. అతడి కోసం ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా హేమంత్ కోసం ఫోన్ చేస్తే వాళ్ల కుటుంబసభ్యుడు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని మానస ఆరోపించింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి వచ్చేందుకు అనుమతించడం లేదు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఓ ఎన్నారైని గత డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. మానస అమెరికాకు వెళ్లినప్పటి నుంచి హేమంత్ పెళ్లి చేసుకుంటానని ఫోన్లో చెప్పాడు. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న మానస విషయాన్ని భర్తకు చెప్పి...హేమంత్ కోసం అమెరికా నుంచి విజయవాడకు వచ్చింది. ఈలోగా...హేమంత్ రెడ్డి కనిపించకుండా పోవడంతో... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో బంధువుల ఇంట్లో చేరింది. అక్కడ ఉంటూనే ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో..హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు కట్నం డిమాండ్ చేయడంతో ..వేరే దారి లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి వచ్చిన మానసను కట్నం పేరుతో మోసం చేయడం సరైన పద్దతి కాదంటున్నారు బంధువులు. ఎలాగైనా పోలీసులే మానసకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పెళ్లి రోజే గృహిణి ఆత్మహత్య
భర్తే హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ అత్త మామలు, భర్త అరెస్టు కాటేదాన్, న్యూస్‌లైన్: తాగుబోతు భర్త వే ధింపులు తట్టుకోలేక ఓ గృహిణి పెళ్లిరోజే తనువు చాలించింది. మైలార్‌దేవ్‌పల్లి ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తకోటకు చెందిన నరేందర్‌రెడ్డి(30), రాధ(26) భార్యాభర్తలు. వీరికి హేమంత్‌రెడ్డి(4), అవిక(8 నెలలు) సంతానం. కాగా వీరి కుటుంబం లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్ 2, ఫ్లాట్‌నెంబర్ 32లో స్థిరపడింది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే నరేందర్‌రెడ్డి తాగుడుకు బానిసై తరచూ భార్యను వేధించసాగాడు. ఇదిలావుండగా, సోమవారం వీరి పెళ్లిరోజు కావడంతో ఇంటికి బంధువులు వచ్చారు. అంతా కలిసి గుడికెళ్లి వచ్చారు. అనంతరం రాత్రి బంధువులు డాబాపైన పడుకోగా, నరేందర్‌రెడ్డి, రాధలు ఇంట్లో పడుకున్నారు. అప్పటికే తాగినమైకంలో ఉన్న భర్త రాధను తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన నరేందర్‌రెడ్డి.. రాధ మృతదేహాన్ని కిందకు దింపి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనను గుర్తించిన బంధువులు, స్థానికులు నరేందర్‌రెడ్డికి దేహశుద్ధి చేయగా, జరిగిన విషయాన్ని వెల్లడించాడు. అయితే, రాధను భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త నరేందర్‌రెడ్డితో పాటు అత్తమామలు విమలమ్మ(45), నాగిరెడ్డి(50)లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లి మరణించి, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.