her boy friend
-
బ్రిట్నీ స్పియర్స్ మోసపోయిందా?
పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 2010 నుంచీ కొన్నేళ్ల పాటు ఇటు పర్సనల్‌గా, కెరీర్ పరంగా చాలా కష్టాలనే ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ చేస్కొని చక్కగా లైఫ్‌ని లీడ్ చేస్తోంది. ముఖ్యంగా శామ్ అస్గరీతో ప్రేమలో పడ్డాక బ్రిట్నీ లైఫంతా మారిపోయింది. ఇప్పుడు ఊహించనంత సంతోషంగా రోజులను గడుపుతోందామె. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తారు. బ్రిట్నీకేమో 36 ఏళ్లు. శామ్ అస్గరీకి 23 ఏళ్లు. వయసులో చాలా తేడా ఉన్నా ఇద్దరూ చూడముచ్చటగా కనిపిస్తారు. అది వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టంగా ప్రేమించుకోవడం వల్లేనేమో! కపుల్ గోల్స్ క్యాటగిరీలో వీళ్లనూ పడేస్తుంటారు నెటిజన్స్. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే తాజాగా బయటకొస్తోన్న ఓ వార్త కొంత తేడాగా ఉంది. ఓవైపు బ్రిట్నీతో ప్రేమలో ఉంటూనే, మరోవైపు వేరే అమ్మాయిలతోనూ డేట్ చేస్తున్నాడట శామ్. ఇదెంతవరకూ నిజమన్నది ఎవ్వరికీ తెలియదు కానీ డేటింగ్ యాప్స్‌లో శామ్ అఫీషియల్ అకౌంట్స్ ఉన్నాయని, బ్రిట్నీతో పాటుగా, అతను వేరే అమ్మాయిల వెంట కూడా పడుతున్నాడని ఈ అకౌంట్స్ చూపించి, చెబుతున్నారు నెటిజన్లు. బ్రిట్నీ అంత పాపులర్ కాదు శామ్. మోడల్‌గా ఇప్పుడే కెరీర్లో వృద్ధిలోకి వస్తున్నాడు. అలాంటి వాడు బ్రిట్నీనే మోసం చేస్తున్నాడా? బ్రిట్నీ నిజంగానే ప్రేమలో మోసపోతోందా? కాలమే సమాధానం చెప్పాలి. శామ్ అయితే తాను అలాంటి వాడిని కానని క్లీన్ చీట్ ఇచ్చుకుంటున్నాడు తనకు తానే! చూడాలి... ఈ ప్రేమకథ ఎటు వెళుతుందో!! -
పెళ్లి కోసం ప్రియురాలి పోరాటం
ప్రియుడి ఇంటి ముందు ఆందోళన బాధితురాలిది నల్లగొండ జిల్లా రెడ్డిగూడెం తాడిపత్రి రూరల్(అనంతపురం) : తెలంగాణ యువతి పెళ్లి కోసం తను ప్రేమించిన ఆంధ్రప్రదేశ్ యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి బీటెక్ చదివాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో అదనపు కోర్సు కోసం శిక్షణ కేంద్రానికి వెళ్లాడు. ఎంబీఏ చదివిన నల్లగొండ జిల్లా రెడ్డిగూడెంకు చెందిన చైతన్య అనే యువతి కూడా అదే కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. అలా ఏర్పడిన వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. మూడు నెలల నుంచి చంద్రకాంత్‌రెడ్డి చైతన్యతో మాట్లాడటం మానేశాడు. కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆఖరికి ఫోన్‌కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. దీంతో చైతన్య శుక్రవారం గంగాదేవిపల్లికి చేరుకుంది. ఆ సమయంలో ప్రియుడు గ్రామంలో లేడు. దీంతో ఆమె ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. చంద్రకాంత్‌రెడ్డికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో.. మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చావు అంటూ చైతన్యతో చంద్రకాంత్ కుటుంబసభ్యులు మండిపడ్దారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంతవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించింది. ఈ విషయంపై బాధితురాలి నుంచి ఎటువంటి ఫిర్యాదూ అందలేదని రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు.