Heritage jobs in singareni
-
ఏ ముఖంతో ఓట్లడుగుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఏఐటీయూసీకి ఓటేస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వస్తాయా అని ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కె.కవిత ప్రశ్నించారు. ఏఐటీయూసీ గెలిచినా, ఓడినా ఉద్యోగాలు ఇప్పించలేరని, వారి మాటలతో మోసపోవద్దని కోరారు. ఆదివారమిక్కడ పలువురు టీఎన్టీయూసీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ‘‘వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిన ఏఐటీయూసీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. వారసత్వ ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ వాగ్దానం చేసింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఇదంతా గిట్టని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు మాయమాటలు చెప్పి కొందరితో కోర్టులో కేసు వేయించారు. సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుస్తుందన్న భయంతోనే బద్ధ విరోధులైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు కూటమిగా ఏర్పడ్డాయి’’అని అన్నారు. 18 ఏళ్ల కింద అప్పటి సీఎం చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయ ఒప్పందంపై ఏఐటీయూసీ సంతకం పెట్టింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఆ ద్రోహాన్ని కార్మికులు ఎలా మరచిపోతారని అన్నారు. కొత్తగా 5,600 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. వీఆర్ఎస్లో డబ్బు తీసుకోని వారికి బదిలీ వర్కర్లుగా అవకాశం కల్పించిన విషయం కార్మికులకు తెలుసునన్నారు. తెలంగాణను సాధించుకున్నట్టే డిపెండెంట్ ఉద్యో గాలను కూడా టీబీజీకేఎస్ సాధిస్తుందని స్పష్టంచేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
సింగరేణిలో 'వారసత్వ' ఒత్తిడి
హక్కు పునరుద్ధరణకు ప్రతిపక్ష సంఘాల పోరాటం 26న అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు స్పందన రాకుంటే దీర్ఘకాలిక సమ్మెకు.. మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అతి త్వరలో జరగనున్నారు. ఈ సమయంలో టీబీజీకేఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్ష సంఘాలు వారసత్వ ఉద్యోగాల సాధనపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వం, యూజమాన్యంపై ఒత్తిడి తేవడానికి సన్నద్ధమవుతున్నారు. ‘వారసత్వాన్ని’ ఇంతకాలం పట్టించుకోని ప్రధాన సంఘాలు కార్మికుల్లో పెరుగుతున్న డిమాండ్ మేరకు సమస్యను భుజాన ఎత్తుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నారు. సింగరేణిలో సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయనేది స్పష్టం అవుతోంది. ఇందుకు ప్రధాన సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సికాసం, డిస్మిస్డ్ కార్మిక సంఘం, టీపీఎఫ్, అన్‌ఫిట్ ఫోరం నాయకులు, కార్యకర్తలు ఏకమవుతున్నారు. వారసత్వ ఉద్యోగాలతో పాటు, డిస్మిస్డ్, వీఆర్ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆయా సంఘాలు ఈనెల 26న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారుు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు యూజమాన్యం సుముఖంగా లేకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఇంకా నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తుండడంతో ప్రధాన సంఘాలన్నీ ఐక్య పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన టీబీజీకేఎస్ కార్మికులను మోసం చేసిందనే విషయాన్ని వివరించడానికే సమ్మె బాట పడుతున్నట్లు ఆ సంఘాలు స్పష్టం చేస్తున్నా యి. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో సమ్మెకు వెళితే కార్మికుల నుంచి అంతగా స్పందన రాదనే అభిప్రాయంతో మరికొన్ని సంఘాల దూరంగా ఉన్నట్లు సమాచారం. నష్ట నివారణకు టీబీజీకేఎస్ కసరత్తు వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ విషయంలో ప్రధాన ప్రతిపక్షాలు సమ్మె వరకు వెళితే తమకు భారీగా నష్టం జరిగే అవకాశముందని గ్రహించిన గుర్తింపు కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆయూ సంఘాలకు ఆ అవకాశం ఇవ్వకుండా చూసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. సమ్మె నోటీసు ఇవ్వడానికి ముందుగానే అధిష్టానంతో వారసత్వ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయించేందుకు సర్వ శక్తులను కూడగట్టుకుని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికల సమయానికి ‘వారసత్వ’ ప్రకటన చేసి ఇప్పటి వరకు కార్మికుల్లో యూనియన్‌పై పెంచుకున్న అపనమ్మకాన్ని తుడిచివేయడంతో పాటు ప్రతిపక్ష సంఘాల నోళ్లు మూయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత నేతృత్వంలో సీఎం కేసీఆర్‌తో హామీలు అమలు చేరుంచేందుకు సమాయత్తమవుతున్నారు. -
వారసత్వ ఉద్యోగాల కోసం.. గనులపై టీ బీజీకేఎస్ ఆందోళనలు
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భూగర్భ గనులు, ఓసీపీలపై సోమవారం ఆందోళన చేపట్టారు. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-1,2, 2ఏ, 5వ గని, 11వ గని, 7ఎల్ఈపీ, పవర్‌హౌస్, సీఎస్పీ, మేడిపల్లి ఓసీపీలపై ఆందోళనలు నిర్వహించి అనంతరం ఆయా గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు మాట్లాడుతూ, 2014 సంవత్సరంలో డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం అధ్యక్షులు కెంగెర్ల మల్లయ్య నాయకత్వంలో ప్రణాళికబద్ధంగా పోరాటాలకు శ్రీకారం చుట్టామన్నారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు కనకం శ్యాంసన్, జనగాం శ్రీనివాస్‌గౌడ్, కె.బాణయ్య, ఎట్టం కృష్ణ, కడవెలుగు రాజమౌళి, గోనె రాజిరెడ్డి, పూర్మ సత్యనారాయణ, గుడి రమేశ్‌రెడ్డి, ఐలయ్య, బంగారి రాజయ్య, జాబు పోషం, దామ నర్సయ్య, సిరంగి రాజేందర్, బి.శివప్రసాద్, రాజపోషం, పి.రవీందర్, సాన జలపతి, దాసరి మొగిళి, ఖయ్యూం, శ్యాంసన్, ప్రేమ్‌నాథ్, అంతయ్య, అర్జున్, కె.సత్యనారాయణరెడ్డి, ఈదునూరి రామస్వామి, సత్యనారాయణరెడ్డి, భగవాన్‌రెడ్డి, వి.వెంకటయ్య, భగవాన్, గండ్ర వెంకటేశ్వర్లు, సీహెచ్ రాజిరెడ్డి, ఎల్.అంజయ్య, ఆనంద్, సుధాకర్, కొమురయ్య, ఎల్.అశోక్, లక్ష్మణ్, కోటయ్య, గనిమహ్మద్, కొప్పుల స్వామి, చక్రపాణి, చిప్ప మల్లేశం, రాంచంద్రారెడ్డి, మండల రాజయ్య, చింతల నర్సయ్య, సాంబారెడ్డి, పులి రవి, నూనె ఓదెలు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ-2లో.. యైటింక్లయిన్‌కాలనీ : ఆర్జీ-2 పరిధిలోని ఆయా గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి అనంతరం మేనేజర్లకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో నాయకులు కొత్త సత్యనారాయణరెడ్డి, యు.స్వామి, లక్ష్మణ్, కొమురెల్లి, కర్క శ్రీనివాస్, సూర్యశ్యాం, నాగేశ్వర్, మల్లేశ్వర్రావు, అగస్ట్రీన్, భూమయ్య, కొప్పుల స్వామి, చిప్ప మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓసీపీ-1 సెటాఫీస్లో గనిమేనేజర్ నాగేశ్వర్రావుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. నాయకులు జైపాల్‌రెడ్డి, పర్రె రాజనరేందర్, కిషన్‌రెడ్డి, భద్రాచలం పాల్గొన్నారు. ఆర్జీ-3లో.. సెంటినరీకాలనీ: వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని అన్ని గనుల మేనేజర్లకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. వారసత్వ ఉద్యోగాల సాధన ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు పెర్కారి నాగేశ్వర్రావు, వేగోలపు మల్లయ్య, బత్తుల రమేశ్, పర్రె రాజనరేందర్, గాజుల తిరుపతి, ఇటిక్యాల శంకర్, కండె మల్లయ్య, ఇసంపల్లి రమేశ్, ముమ్మిడి శ్రీనివాస్, చారి, జైపాల్‌రెడ్డి, భాస్కర్, యాకూబ్, విజేందర్‌రెడ్డి, నాగెల్లి సాంబయ్య పాల్గొన్నారు.