గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భూగర్భ గనులు, ఓసీపీలపై సోమవారం ఆందోళన చేపట్టారు. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-1,2, 2ఏ, 5వ గని, 11వ గని, 7ఎల్‌ఈపీ, పవర్‌హౌస్, సీఎస్పీ, మేడిపల్లి ఓసీపీలపై ఆందోళనలు నిర్వహించి అనంతరం ఆయా గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు మాట్లాడుతూ, 2014 సంవత్సరంలో డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం అధ్యక్షులు కెంగెర్ల మల్లయ్య నాయకత్వంలో ప్రణాళికబద్ధంగా పోరాటాలకు శ్రీకారం చుట్టామన్నారు.
వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు కనకం శ్యాంసన్, జనగాం శ్రీనివాస్‌గౌడ్, కె.బాణయ్య, ఎట్టం కృష్ణ, కడవెలుగు రాజమౌళి, గోనె రాజిరెడ్డి, పూర్మ సత్యనారాయణ, గుడి రమేశ్‌రెడ్డి, ఐలయ్య, బంగారి రాజయ్య, జాబు పోషం, దామ నర్సయ్య, సిరంగి రాజేందర్, బి.శివప్రసాద్, రాజపోషం, పి.రవీందర్, సాన జలపతి, దాసరి మొగిళి, ఖయ్యూం, శ్యాంసన్, ప్రేమ్‌నాథ్, అంతయ్య, అర్జున్, కె.సత్యనారాయణరెడ్డి, ఈదునూరి రామస్వామి, సత్యనారాయణరెడ్డి, భగవాన్‌రెడ్డి, వి.వెంకటయ్య, భగవాన్, గండ్ర వెంకటేశ్వర్లు, సీహెచ్ రాజిరెడ్డి, ఎల్.అంజయ్య, ఆనంద్, సుధాకర్, కొమురయ్య, ఎల్.అశోక్, లక్ష్మణ్, కోటయ్య, గనిమహ్మద్, కొప్పుల స్వామి, చక్రపాణి, చిప్ప మల్లేశం, రాంచంద్రారెడ్డి, మండల రాజయ్య, చింతల నర్సయ్య, సాంబారెడ్డి, పులి రవి, నూనె ఓదెలు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ-2లో..
యైటింక్లయిన్‌కాలనీ : ఆర్జీ-2 పరిధిలోని ఆయా గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి అనంతరం మేనేజర్‌లకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో నాయకులు కొత్త సత్యనారాయణరెడ్డి, యు.స్వామి, లక్ష్మణ్, కొమురెల్లి, కర్క శ్రీనివాస్, సూర్యశ్యాం, నాగేశ్వర్, మల్లేశ్వర్‌రావు, అగస్ట్రీన్, భూమయ్య, కొప్పుల స్వామి, చిప్ప మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓసీపీ-1 సెటాఫీస్‌లో గనిమేనేజర్ నాగేశ్వర్‌రావుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. నాయకులు జైపాల్‌రెడ్డి, పర్రె రాజనరేందర్, కిషన్‌రెడ్డి, భద్రాచలం పాల్గొన్నారు.
ఆర్జీ-3లో..
సెంటినరీకాలనీ: వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని అన్ని గనుల మేనేజర్లకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. వారసత్వ ఉద్యోగాల సాధన ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు పెర్కారి నాగేశ్వర్‌రావు, వేగోలపు మల్లయ్య, బత్తుల రమేశ్, పర్రె రాజనరేందర్, గాజుల తిరుపతి, ఇటిక్యాల శంకర్, కండె మల్లయ్య, ఇసంపల్లి రమేశ్, ముమ్మిడి శ్రీనివాస్, చారి, జైపాల్‌రెడ్డి, భాస్కర్, యాకూబ్, విజేందర్‌రెడ్డి, నాగెల్లి సాంబయ్య పాల్గొన్నారు.
వారసత్వ ఉద్యోగాల కోసం.. గనులపై టీ బీజీకేఎస్ ఆందోళనలు
Published Tue, Jan 7 2014 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement