Hero panti
-
హాఫ్ గాళ్ ఫ్రెండ్!
హిందీ రంగంలో అవకాశం తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టమే. కృతీ సనన్ది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన గుర్తింపుతో ‘హీరో పంతి’ సినిమాలో అవకాశం సంపాదించుకోగలిగారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత వెంటనే కృతీకి బాలీవుడ్లో అవకాశం రాలేదు. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో కృతీ సనన్ చెబుతూ - ‘‘మొదటి సినిమా విడుదల కాగానే, రెండో సినిమాకి అవకాశం రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ‘హీరో పంతి’ సినిమా రిలీజ్ అయ్యాక ‘కృతీ సనన్ అని ఓ అమ్మాయి ఉందట’ అని అందరి దృష్టిలో పడ్డాను. అదే నాకు పెద్ద ఎచీవ్మెంట్. రెండో అవకాశం రావడానికి కొంత టైమ్ పట్టింది. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే ‘దిల్వాలే’లో మంచి పాత్ర చేశాను. ఈ సినిమాతో నేనెక్కువ మందికి రీచ్ కాగలుగుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన కృతి ఆ తర్వాత ఇక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. హిందీలోనే ‘హాఫ్ గాళ్‌ఫ్రెండ్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్లో ఓ తీపి గుర్తుగా నిలిచిపోతుందని కృతి సంబరపడిపోతూ చెబుతున్నారు. -
కృతి.. గతి తిరిగింది!
-
అమ్మానాన్నలకు అంకితం: టైగర్ ష్రాఫ్
ముంబై: టైగర్ ష్రాఫ్ తన తొలి సినిమా ‘హీరో పంతి’ విజయాన్ని అమ్మానాన్నలు జాకీ ష్రాఫ్, ఆయేషాలకు అంకితం చేశాడు. ఈ సినిమా తొలి వారంలోనే రూ. 21 కోట్లు వసూలు చేసింది. ‘ఈ విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నా. ఈ విజయంతో మా నాన్న ఎంతగానో పొంగిపోయాడు. ఆయన గతకొంతకాలంగా సంతృప్తికరంగా లేడు. తల్లిదండ్రులను సంతోషపెట్టడమే నా లక్ష్యం. అది ఇప్పుడు నిజమైంది’ అని అన్నాడు. యాక్షన్ సీన్లలో తన క్రియాశీలత్వం పాఠకులను పరవసింపజేసిందని ఈ 24 ఏళ్ల నవ యువకుడు చెప్పాడు. సాబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వర్ధమాన తార కృతి సనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా విజయవంతం కావడంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నాడు టైగర్ ష్రాఫ్. విమర్శకుల ప్రశంసలు పొందడం, బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంపై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ అందరికీ వినోదం కల్పించడమే సినిమా ఉద్దేశమన్నాడు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఇకపై తన లక్ష్యమన్నాడు. బాక్సాఫీస్ గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నానన్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం అంత తేలికేమీ కాదన్నాడు. తాము ఏవిధంగా నటిస్తున్నామనే విషయం అత్యంత ముఖ్యమన్నాడు. ప్రేక్షకులు సినిమా థియేటర్‌కు వస్తే వినోదం పొందాల్సిందేనన్నాడు. ‘హీరో పంతి’ సినిమా తీయడంలోని ఉద్దేశం కూడా అదేనన్నాడు. -
అప్పటికప్పుడు కవిత రాసేశాను!
తొలి చూపులోనే ఆకట్టుకునే అందం కృతీ సనన్ సొంతం. ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో ‘హీరో పంతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్లో తను చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి కృతిపై పడింది. భవిష్యత్ చాలా ఆశాజనకంగా ఉందంటున్నారామె. నటన మాత్రమే కాదు.. కృతికి ఇతర ప్రతిభలు కూడా ఉన్నాయి. స్కూల్, కాలేజ్ డేస్‌లో బాగా డాన్స్ చేసేవారట. అలాగే కవితలు కూడా రాసే అలవాటు ఉండేదట. దాని గురించి కృతి చెబుతూ - ‘‘నాకు కవితలు రాయడం చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకముందు తెగ రాసేదాన్ని. కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత తీరిక చిక్కడంలేదు. మా తాత చనిపోయినప్పుడు ఓ కవిత రాశాను. అల్లారు ముద్దుగా చూసుకున్న తాత ఇక లేరనే బాధలోంచి ఆశువుగా పుట్టుకొచ్చిన కవిత అది. నేను రాసిన చివరి కవిత అదే. హీరోయిన్ అయిన తర్వాత ఏ కాస్త టైమ్ చిక్కినా సినిమాలు చూస్తున్నాను. అలాగే ఢిల్లీలో మా ఇంటికెళ్లి, కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. అందుకే కవితలు రాయడానికి టైమ్ ఉండటంలేదు’’ అన్నారు