
హాఫ్ గాళ్ ఫ్రెండ్!
హిందీ రంగంలో అవకాశం తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టమే. కృతీ సనన్‌ది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన గుర్తింపుతో ‘హీరో పంతి’ సినిమాలో అవకాశం సంపాదించుకోగలిగారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత వెంటనే కృతీకి బాలీవుడ్‌లో అవకాశం రాలేదు.
ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో కృతీ సనన్ చెబుతూ - ‘‘మొదటి సినిమా విడుదల కాగానే, రెండో సినిమాకి అవకాశం రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ‘హీరో పంతి’ సినిమా రిలీజ్ అయ్యాక ‘కృతీ సనన్ అని ఓ అమ్మాయి ఉందట’ అని అందరి దృష్టిలో పడ్డాను. అదే నాకు పెద్ద ఎచీవ్‌మెంట్. రెండో అవకాశం రావడానికి కొంత టైమ్ పట్టింది. అయినా ఫర్వాలేదు.
ఎందుకంటే ‘దిల్‌వాలే’లో మంచి పాత్ర చేశాను. ఈ సినిమాతో నేనెక్కువ మందికి రీచ్ కాగలుగుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన కృతి ఆ తర్వాత ఇక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. హిందీలోనే ‘హాఫ్ గాళ్‌ఫ్రెండ్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఓ తీపి గుర్తుగా నిలిచిపోతుందని కృతి సంబరపడిపోతూ చెబుతున్నారు.