డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ క్రేజీ కౌంటర్! | Kriti Sanon denies holidaying in Thailand with Sushant | Sakshi
Sakshi News home page

డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ క్రేజీ కౌంటర్!

Published Tue, Jun 28 2016 7:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ క్రేజీ కౌంటర్! - Sakshi

డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ క్రేజీ కౌంటర్!

‘నా ఆప్తురాలు నుపూర్ సనన్‌తో కలిసి ప్రస్తుతం ఇంట్లో ఛాయ్ తాగుతున్నా. థాయ్‌లాండ్‌లో అచ్చం నాలాంటి వారిని ఎవరినో చూసి.. నేనేనని మీరు పొరబడి ఉంటారు’ .. తనపై రూమర్స్ రాసిన ఓ వెబ్‌సైట్‌కి హీరోయిన్ కృతి సనన్ ఇచ్చిన కేజ్రీ సమాధానం ఇది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘వన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.

త్వరలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి ‘రాబ్తా’ సినిమాను కృతి చేయబోతున్నది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ తో కృతి సన్నిహితంగా మెలుగుతున్నదని, ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నదని గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో వదంతులు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సినీ వెబ్‌సైట్.. సుశాంత్, కృతి థాయ్‌లాండ్‌లో విహరిస్తున్నారని, ‘రాబ్తా’ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ పనిలోపనిగా.. ఈ జంట కలిసి విహరిస్తున్నదని కథనం రాసింది. దీనికి కౌంటర్ ఇస్తూ.. తాను ఇంట్లోనే ఆప్తురాలితో ఛాయ్ తాగుతున్నానంటూ ఆ ఫొటోను కృతి షేర్ చేసింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement