హీరోయిన్ వల్లే వాళ్లు బ్రేకప్ అయ్యారా? | breakup with Ankita Lokhande then Sushant found love with kriti | Sakshi
Sakshi News home page

హీరోయిన్ వల్లే వాళ్లు బ్రేకప్ అయ్యారా?

Published Sun, May 8 2016 11:35 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హీరోయిన్ వల్లే వాళ్లు బ్రేకప్ అయ్యారా? - Sakshi

హీరోయిన్ వల్లే వాళ్లు బ్రేకప్ అయ్యారా?

బెంగళూరు: ఒకరితో విడిపోవడం ఆ వెంటనే కొన్ని రోజులకే మరొకరితో జతకట్టడం బాలీవుడ్ లో కామన్ అయిపోయింది. ఇటీవలే బ్రేకప్ అయిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజపుత్, అంకితా లోఖాండే. హీరో సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లిపీటలెక్కుతారంటూ వార్తలు అలా గుప్పుమన్నాయో లేదో ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటిస్తున్నాడు. ఆ మూవీ కంటే ముందుగా రాబ్తా మూవీకి సైన్ చేశాడు. కొన్ని నెలల నుంచి రాబ్తా కూడా షూటింగ్ జరుగుతోంది.

సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేది. ప్రస్తుతం ‘రాబ్తా’. షూటింగ్ లో పాల్గొంటున్న సుశాంత్, కృతీసనన్  చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారట. అంకితతో తెగదెంపులు చేసుకున్న సుశాంత్, కృతీతో కొత్త ప్రేమను వెతుక్కుంటున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్ ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువ అని, త్వరలోనే ఈ విషయంపై అందరికీ వారు ఓ క్లారిటీ ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కృతీతో పరిచయం పెరిగినప్పటి నుంచీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమెతో కలిసి దిగిన ఫొటో ఏదో ఒకటి అప్ లోడ్ చేస్తూ సుశాంత్ అంకితను అప్ సెట్ చేయడమే బ్రేకప్ కు కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement