ఫుల్లుగా తాగి.. హీరోను నోటికొచ్చినట్లు తిట్టింది! | Sushant Singh Rajput and Ankita Lokhande breakup issue | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి.. హీరోను నోటికొచ్చినట్లు తిట్టింది!

Published Tue, May 10 2016 5:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫుల్లుగా తాగి.. హీరోను నోటికొచ్చినట్లు తిట్టింది! - Sakshi

ఫుల్లుగా తాగి.. హీరోను నోటికొచ్చినట్లు తిట్టింది!

ముంబై: ఇటీవలే బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజపుత్, అంకితా లోఖాండే. విడిపోయిన ఈ జోడీ గురించి మరిన్ని విషయాలు బయటకొస్తున్నాయి. బ్రేకప్ విషయాన్ని మొదటపెట్టింది సుశాంత్. అంతటితో ఆగకుండా అంకితాతో విడిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా లీక్ చేస్తున్నాడు. ఓ ప్రైవేట్ పార్టీలో టీవీ నటి అంకితా ఫుటుగా తాగి లవర్ సుశాంత్ పై నోరు పారేసుకుందట. ఇష్టం వచ్చినట్లు సుశాంత్ ను తిట్టిందట. ఈ విషయాలు అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేదని బాలీవుడ్ టాక్.

'ఆమె బాగా డ్రింక్ చేస్తేనేమి, నేను ఆడవాళ్లతో క్లోజ్ గా ఉంటేనేం' ఏది ఏమైనా మా బ్రేకప్ జరిగిపోయిందంటూ కొన్ని రోజుల కిందట సుశాంత్ ట్వీట్ చేశాడు. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీన్ని బట్టి అంకితా తాగుడుకు హద్దు లేదని, ఆ తర్వాత ఆమె కంట్రోల్ లో ఉందడని తేలిపోయింది. కరెక్టుగా ఆ సమయంలో సుశాంత్ మిగతా సెలబ్రిటీలతో చాలా చనువుగా మెలగడం కూడా అంకితాకు కోపం తెప్పించిందని కథనాలు వచ్చాయి. తనతో క్లోజ్ గా ఉన్నందుకు తనపై తనకే విరక్తిగా ఉందని, ఇంకా ఏవో మాటలన్నదని సుశాంత్ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. తనకు ప్రేమించడం ఎలాగన్నది తెలుసునంటూ అంకితా కూడా ఈ మధ్య ట్వీట్ చేసింది. బ్రేకప్ అయిన తర్వాత ఇప్పటివరకూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement