బాలీవుడ్ జోడీ బ్రేకప్ చెప్పేసింది | Sushant Singh Rajput and Ankita Lokhande breakup confirmed | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ జోడీ బ్రేకప్ చెప్పేసింది

Published Thu, May 5 2016 12:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బాలీవుడ్ జోడీ బ్రేకప్ చెప్పేసింది - Sakshi

బాలీవుడ్ జోడీ బ్రేకప్ చెప్పేసింది

బెంగళూరు: బాలీవుడ్ కు బ్రేకప్ అనే పదం బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. లవర్స్ మాత్రమే కాదు భార్యాభర్తలు కూడా పదేళ్ల బంధం తర్వాత విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా అలాంటి బ్రేకప్ మరొకటి బాలీవుడ్ లో జరిగింది. టీమిండియా క్రికెటర్ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటిస్తున్నాడు. సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని స్థానిక మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సుశాంత్ భావించాడు.

అంకితతో బ్రేకప్ అయినట్లు సుశాంత్ సన్నిహితుల వద్ద చెప్పాడట. ట్విట్టర్లో తన బ్రేకప్ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు సుశాంత్. ఇప్పుడు వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ జీవితాన్ని పంచుకుంటారని ఆశపడ్డారు. కానీ, ఇంతలోనే బ్రేకప్ వార్తలు ప్రచారం జరిగాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందనుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’.. ఈ మూవీ షూటింగ్స్ లో భాగంగా కాస్త చనువుగా ఉండటంపై అంకిత కోపంగా ఉండటమే ఈ బ్రేకప్ వరకు వెళ్లిందని బాలీవుడ్ వర్గాల టాక్.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement