అభిమానులకు హీరో చిన్న విజ్ఞప్తి | Please find some time and love for raabta, asks Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

అభిమానులకు హీరో చిన్న విజ్ఞప్తి

Published Thu, Jun 8 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

అభిమానులకు హీరో చిన్న విజ్ఞప్తి

అభిమానులకు హీరో చిన్న విజ్ఞప్తి

ముంబై: ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువైన బాలీవుడ్ మూవీ రాబ్తా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాకు రాబ్తా కాపీ అంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించగా.. కేవలం ట్రైలర్ చూసి కాపీ అనడం భావ్యం కాదని మూవీ యూనిట్ వివరణ ఇచ్చుకుంది. రేపు (శుక్రవారం) విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో 'రాబ్తా' హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. 'నా మూవీ రాబ్తా రేపు విడుదల కానుంది. ఎలాగైనా సరే కాస్త తీరక చేసుకుని మూవీ చూడండి. మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోగలరని' సుశాంత్ ట్వీట్ చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' తో సక్సెస్ బాట పట్టాడు సుశాంత్. ఓ మంచి సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో రాబ్తాపై ఈ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం ఎంతగానో కసరత్తులు చేయడం తెలిసిందే. హిట్ కోసం ఎదురుచూస్తున్న కృతి సనన్‌కు రాబ్తా సక్సెస్ కీలకం కానుంది. మరోవైపు టాలీవుడ్ మూవీ మగధీరను కాపీ కొట్టారంటూ వివాదం రాజుకోవడంతో రాబ్తాకు ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. దీంతో 'రీల్' ధోనీని ప్రేక్షక్షులు ఆధరిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. సుశాంత్‌, ‘వన్‌ నేనొక్కడినే’ ఫేమ్ కృతి సనన్‌ జంటగా నటించిన ఈ మూవీ రేపు (జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement