
అమ్మానాన్నలకు అంకితం: టైగర్ ష్రాఫ్
ముంబై: టైగర్ ష్రాఫ్ తన తొలి సినిమా ‘హీరో పంతి’ విజయాన్ని అమ్మానాన్నలు జాకీ ష్రాఫ్, ఆయేషాలకు అంకితం చేశాడు. ఈ సినిమా తొలి వారంలోనే రూ. 21 కోట్లు వసూలు చేసింది. ‘ఈ విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నా. ఈ విజయంతో మా నాన్న ఎంతగానో పొంగిపోయాడు. ఆయన గతకొంతకాలంగా సంతృప్తికరంగా లేడు. తల్లిదండ్రులను సంతోషపెట్టడమే నా లక్ష్యం. అది ఇప్పుడు నిజమైంది’ అని అన్నాడు. యాక్షన్ సీన్లలో తన క్రియాశీలత్వం పాఠకులను పరవసింపజేసిందని ఈ 24 ఏళ్ల నవ యువకుడు చెప్పాడు. సాబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వర్ధమాన తార కృతి సనన్ కథానాయికగా నటించింది.
ఈ సినిమా విజయవంతం కావడంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నాడు టైగర్ ష్రాఫ్. విమర్శకుల ప్రశంసలు పొందడం, బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంపై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ అందరికీ వినోదం కల్పించడమే సినిమా ఉద్దేశమన్నాడు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఇకపై తన లక్ష్యమన్నాడు. బాక్సాఫీస్ గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నానన్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం అంత తేలికేమీ కాదన్నాడు. తాము ఏవిధంగా నటిస్తున్నామనే విషయం అత్యంత ముఖ్యమన్నాడు. ప్రేక్షకులు సినిమా థియేటర్‌కు వస్తే వినోదం పొందాల్సిందేనన్నాడు. ‘హీరో పంతి’ సినిమా తీయడంలోని ఉద్దేశం కూడా అదేనన్నాడు.