శ్రీవారి సేవలో హీరో శ్రీకాంత్ కుటుంబం
తిరుమల: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో వారు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.