heroine Nandita
-
నిఖిల్ సరసన నందిత
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజా చిత్రంలో తమిళ నటి నందితా శ్వేత కధానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది. కొన్ని నెలల పాటు కొత్త హీరోయిన్ కోసం అన్వేషించిన చిత్ర యూనిట్ ఫైనల్‌గా నందితా శ్వేతను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నిఖిల్ సరసన ఈ సినిమాలో అవికా గోర్, హెబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా నందిత కూడా అలరించనుంది. తెలుగులో అవకాశాలు తలుపు తట్టినప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు ఏ సినిమా అంగీకరించలేదని నందిత చెబుతోంది. ప్రస్తుతం ఓ హర్రర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. అది పూర్తవగానే నిఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకధగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. ఆనంద్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర స్వరాలందిస్తున్నాడు. -
నా సంక్రాంతి వైజాగ్‌లోనే...
పండగ అంటే నాకు వైజాగ్ గుర్తొచ్చేస్తుంది. మా అమ్మమ్మ, తాతయ్య, ఇంకా చాలామంది బంధువులు వైజాగ్‌లోనే ఉన్నారు. వాళ్లందరితో పండగ చేసుకోవడం కోసం నేను వైజాగ్‌లో వాలిపోయా. నాకు ముగ్గులంటే చాలా ఇష్టం. పోటీపడి మరీ ముగ్గులు వేసేదాన్ని. ఇప్పుడూ అంతే. అసలు సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు. అవి లేకపోతే ఏం బాగుంటుంది. ఇక, టేస్టీ టేస్టీ కట్టె పొంగలి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పటికీ, సంక్రాంతిని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. -నందిత