కాంగ్రెస్ - బీజేపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్
న్యూఢిల్లీ: హెరాల్డ్ కేసు నేపథ్యంలో కేంద్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శల యుద్ధం శనివారం తారాస్థాయికి చేరింది.
మోదీ కుట్రలో స్వామి ఇరుసు మాత్రమే...
‘‘సుబ్రమణ్యంస్వామికి ‘జడ్’ కేటగిరీ భద్రతను, కేబినెట్ మంత్రి నివాసాన్ని శుక్రవారమే ఎందుకు ఇచ్చింది? ఇది మోదీసారథ్యంలో నడుస్తున్న రాజకీయ ప్రతీకారం.. ఈ కుట్రలో స్వామి ఒక ఇరుసు మాత్రమే.’’
- రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
ప్రజలు తగిన జవాబు చెప్తారు...
‘‘బీజేపీ-ఆర్ఎస్ఎస్లకు దేశ ప్రజలు గతంలో చెప్పినట్లు తగిన సమాధానం చెప్తారు.’’
- దిగిజ్వయ్సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
వారిది సిగ్గుచేటయిన డ్రామా...
‘‘సోనియా, రాహుల్‌ల మాటలు చూస్తుంటే.. వారు అవినీతి కోసం సిగ్గుచేటయిన రీతిలో రోడ్డుపై డ్రామా చేస్తూ పోరాడుతున్నారు. ’’
- ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేంద్రమంత్రి