Hey Balwanth Movie
-
ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడడం మిస్సయివారు ఎంచక్కా ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.The business begins!#HeyBalwanthSTREAMING NOW #TeluguZee5 #Suhas #HeyBalwanthOnZee5 pic.twitter.com/34BOOlrBJR— ZEE5 Telugu (@ZEE5Telugu) March 30, 2026 -
ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన
టాలీవుడ్లో అడపాదడపా కామెడీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా గత నెలలో సుహాస్ హీరోగా చేసిన ఓ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో కొందరికి నచ్చగా.. మరికొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమైనా సరే యావరేజ్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'హే బల్వంత్' విషయానికొస్తే.. కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రిలా బిజినెస్‌మ్యాన్ అవ్వాలనేది కోరిక. కానీ నాన్న ఏం పనిచేస్తుంటాడనేది మాత్రం తెలీదు. ఇతడి నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) కూడా ఎందరో ఆడవాళ్లకి బతుకునిస్తున్నాడని చెబుతుంది. మొత్తానికి పెద్దయ్యాక కృష్ణకు తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని అంగీకరించాడనికే కృష్ణ చాలా ఇబ్బంది పడతాడు. అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని)కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా దాస్తాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? చివరకు కృష్ణ-మిత్ర ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?) -
వసూళ్లు చూసి ధైర్యం వచ్చింది: సుహాస్
‘‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్ నంబర్లు కూడా కనబడకపోవడంతో భయం వేసింది. కానీ, ‘హే బల్వంత్’ మూవీ వసూళ్లు చూశాక ధైర్యం వచ్చింది. ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి’’ అని హీరో సుహాస్ పేర్కొన్నారు. గోపీ అచ్చెర దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన చిత్రం ‘హే బల్వంత్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 20న విడుదల చేశారు. గురువారం నిర్వహించిన ‘థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ ఈవెంట్’లో బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వచ్చిన తొలి సక్సెస్ ఇది. మంచి సినిమా తీశారంటూ ప్రేక్షకులు అభినందించడం సంతృప్తినిచ్చింది’’ అని తెలిపారు.‘‘మా మూవీ చూసిన అందరూ యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు గోపీ అచ్చెర. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘హే బల్వంత్’కి బ్రేక్ ఈవెన్ కావడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాని దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్నీ కలిపి పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో లాభాల్లోకి వెళతాం. నంది అవార్డ్స్ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్ గురించి నేను ఈ మధ్య తప్పుగా మాట్లాడాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐయామ్ సారీ’’ అని చెప్పారు. నటి, యాంకర్ స్రవంతి చొక్కారపు, లావణ్య రెడ్డి, మహీ రెడ్డి తదితరులుపాల్గొన్నారు. -
‘హే బల్వంత్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇలాంటి టైమ్‌లో అలాంటి రిస్క్ తీసుకోను : కమెడియన్ సుదర్శన్
చాలా మంది హాస్య నటులు తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత హీరోలుగా చేశారు. నా కెరీర్ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో అలాంటి రిస్క్ తీసుకోలేను. ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మెయిన్ లీడ్ సినిమాలు చేయాలని లేదు’ అని అన్నారు కమెడియన్ సుదర్శన్. సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదర్శన్ ఓ కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కమెడిన్ సుదర్శన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు.→ 'హే బల్వంత్' లో మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి. డ్రింకింగ్ సీన్, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్, సుహాస్, నరేష్, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.→ ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్లు బాగా వచ్చాయి→ నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. నటుడిగా సెటిల్ అయిపోయిన తరువాత హీరోగా ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.→ ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్ క్లాష్ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి.→ కొత్త సినిమా విషయాలకొస్తే.. మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. -
సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
ఈ వీకెండ్ థియేటర్లలోకి పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ సుహాస్ హీరోగా చేసిన 'హే బలవంత్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారిక నంబర్స్ వదిలారు. ఎన్ని కోట్లు వచ్చాయనేది పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతవారం రిలీజైన వాటిలో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఈ వారం 'హే బలవంత్' ఆ బాధ్యత తీసుకుంది. ఇది కాకుండా మరో రెండు మూడు విడుదలైనప్పటికీ వాటికి పాజిటివ్ టాక్ రాలేదు. ఇకపోతే సుహాస్, శివానీ నాగారం, నరేశ్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'హే బలవంత్' చిత్రానికి ముందురోజు ప్రీమియర్స్ వేశారు. నిన్న(ఫిబ్రవరి 20) థియేటర్లలోకి వచ్చింది. అలా తొలిరోజు రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. సుహాస్ గత చిత్రంతో పోలిస్తే ఇది చాలా బెటర్. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశముంది.'హే బలవంత్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కృష్ణ(సుహాసన్), తండ్రి బలవంత్(నరేశ్), నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ.. ఆయన బిజినెస్ టేకోవర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి తొలుత వద్దని చెప్పినప్పటికీ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. దీని వల్లే ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏంటి? దాని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన చిక్కేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్)


