hidden-treasure
-
గుప్త నిధుల తవ్వకాల కేసులో ఏడుగురు అరెస్టు
పొదిలి(ప్రకాశం జిల్లా): గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకానికి పాల్పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ సుధాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. తర్లుపాడు మండలం పోతలపాడు దశబంధు చెరువులో ఆదివారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న గ్రామ రక్షక దళానికి గుప్త నిధుల ముఠా పట్టుబడింది. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురు చిక్కగా మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని సోమవారం అరెస్ట్ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేటకు చెందిన సయ్యద్ ఖరీం, డీకే మీరావలి, ఎస్కే సుభాని, బత్తుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి మణి, గురజాలకు చెందిన మన్నం శ్రీనివాస్, నామనకొల్లు గ్రామానికి చెందిన సయ్యద్బాజీ ఉన్నారని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 గడ్డపారలు, 2 చలకపారలు, ఒక బొచ్చె, ఒక పెద్ద సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో తర్లుపాడు ఎస్ఐ సువర్ణ, ఎస్బీ సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కాశిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
వైఎస్ఆర్ జిల్లా, అట్లూరు : అట్లూరు మండలం కమలకూరు పంచాయతీ నల్లాయపల్లి రెవెన్యూ పొలంలోని పాపాయకుంట దగ్గర ఉన్న పురాతనమైన బావిలో గత వారం రోజు లుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. పూర్వ కా లంలో రాజులు ఇక్కడికి వేటమార్గంలో వచ్చినప్పుడు వారాల తరబడి ఈ బావి సమీపంలో సేద తీర్చు కోవడంతో పాటు కొంతమేర గుప్తనిధులు ఈ బావిలో భద్రపరిచేవారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బావిలో తవ్వకాలు జరపగా సు మారు పది అడుగుల లోతులో రెండు నీటి తొట్లు బయటపడ్డాయి. పోలీసులు వి చారణ జరిపితే తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
కర్నూలు, ఆళ్లగడ్డ : అహోబిలం క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ కాలువ సమీపంలో వెలసిన దుర్గమ్మ విగ్రహాన్ని గుప్తనిధులకోసం దుండగులు కూల్చివేసిన ఘటన బుధవారం తీవ్ర సంచలనం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. తెలుగుగంగ అటవీ సమీపంలో దుర్గామాత గుడి ఉంది. ఈగుడిలో ప్రతిష్టించిన దుర్గామాతకు మంగళవారం సాయంత్రం నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పూజలు నిర్వహించడంతో పాటు భజనలు చేస్తూ దారిన వచ్చిపోయేవారికి తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. అర్ధరాత్రి అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి విగ్రహాన్ని పెకిలించి ధ్వంసం చేసి బయట పడేశారు. ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అహోబిలంలో భయం భయం అహోబిలం క్షేత్ర పరిధిలో సుమారు 101 పురాతనమైన గుళ్లు, గోపురాలున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గుళ్లుగోపురాలను గుప్తనిధుల వేటగాళ్లు కూల్చివేసి ధ్వంసం చేశారు. తాజాగా ప్రధాన రోడ్డుపైనే ఉన్న దుర్గమ్మ విగ్రహన్ని కూల్చివేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. -
గుప్త నిధుల దొంగలు హాల్చల్..
సాక్షి, ప్రకాశం: ధనవాంఛ ఎంతటికైనా దారితీస్తోంది. అందుకే ధనం మూలం ఇదం జగత్తు అని పెద్దలు అన్నారు. ఒకేసారి కోట్లకు పడగెత్తాలని ఆశించే వాళ్లు కొంతమంది గుప్త నిధుల బాట పట్టారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోనే దినకొండ మండలం ఆనంతవరం కొండల్లో చోటుచేసుకుంది. అనంతవరం గుట్టల్లో గుప్త నిధులు ఉన్నాయని కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. భారీగా సొత్తు లభిస్తుందనే ఆశతో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. అంతేకాక వందలాది మంది కూలీలతో పాటు యంత్రాల సాయంతో సొరంగం తీసి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న యంత్ర సామాగ్రి, కూలీలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. సుమారు 40 మంది కూలీలు, జేసీబీల సాయంతో గుప్త నిధుల కోసం సుమారు 100 మీటర్ల సొరంగం తవ్వినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కూలీలను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సావ్ పౌలోలోని బ్యాంకో డు బ్రేసిల్ బ్రాంచ్లో దొంగతనానికి పాల్పడేందుకు కొంతమంది దొంగలు ఒక ఇంటిలో నుంచి సొరంగం తవ్వడం తెలిసిందే. -
పూజారిని కట్టేసి గుడిలో తవ్వకాలు
కూడేరు: పాత ఆలయంలోని విగ్రహాల కింద విలువైన ఆభరణాలు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలో తవ్వకాలకు పాల్పడ్డారు. ఆలయ పూజారిని కట్టేసి వినాయకుని విగ్రహం కింద తవ్వకాలు చేపట్టారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అర్థరాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటంతో.. ఆలయ సమీపంలోని స్థానికులు రావడంతో దుండగులు ఆటోలో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.