
దుర్గమ్మ విగ్రహాన్ని కూల్చివేసిన దృశ్యం
కర్నూలు, ఆళ్లగడ్డ : అహోబిలం క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ కాలువ సమీపంలో వెలసిన దుర్గమ్మ విగ్రహాన్ని గుప్తనిధులకోసం దుండగులు కూల్చివేసిన ఘటన బుధవారం తీవ్ర సంచలనం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. తెలుగుగంగ అటవీ సమీపంలో దుర్గామాత గుడి ఉంది. ఈగుడిలో ప్రతిష్టించిన దుర్గామాతకు మంగళవారం సాయంత్రం నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పూజలు నిర్వహించడంతో పాటు భజనలు చేస్తూ దారిన వచ్చిపోయేవారికి తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. అర్ధరాత్రి అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి విగ్రహాన్ని పెకిలించి ధ్వంసం చేసి బయట పడేశారు. ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
అహోబిలంలో భయం భయం
అహోబిలం క్షేత్ర పరిధిలో సుమారు 101 పురాతనమైన గుళ్లు, గోపురాలున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గుళ్లుగోపురాలను గుప్తనిధుల వేటగాళ్లు కూల్చివేసి ధ్వంసం చేశారు. తాజాగా ప్రధాన రోడ్డుపైనే ఉన్న దుర్గమ్మ విగ్రహన్ని కూల్చివేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment