సాక్షి, ప్రకాశం: ధనవాంఛ ఎంతటికైనా దారితీస్తోంది. అందుకే ధనం మూలం ఇదం జగత్తు అని పెద్దలు అన్నారు. ఒకేసారి కోట్లకు పడగెత్తాలని ఆశించే వాళ్లు కొంతమంది గుప్త నిధుల బాట పట్టారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోనే దినకొండ మండలం ఆనంతవరం కొండల్లో చోటుచేసుకుంది.
అనంతవరం గుట్టల్లో గుప్త నిధులు ఉన్నాయని కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. భారీగా సొత్తు లభిస్తుందనే ఆశతో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. అంతేకాక వందలాది మంది కూలీలతో పాటు యంత్రాల సాయంతో సొరంగం తీసి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న యంత్ర సామాగ్రి, కూలీలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. సుమారు 40 మంది కూలీలు, జేసీబీల సాయంతో గుప్త నిధుల కోసం సుమారు 100 మీటర్ల సొరంగం తవ్వినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కూలీలను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సావ్ పౌలోలోని బ్యాంకో డు బ్రేసిల్ బ్రాంచ్‌లో దొంగతనానికి పాల్పడేందుకు కొంతమంది దొంగలు ఒక ఇంటిలో నుంచి సొరంగం తవ్వడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment