పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద
జగ్గయ్యపేట :
తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ముక్త్యాల సమీపంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 42 టీఎంసీలు. అయితే మంగళవారం సాయంత్రానికి 19.7 టీఎంసీల నీరు వచ్చి చేరిందని పులిచింతల డీఈ రఘనాథ్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు నీటి నిల్వను పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిస్తున్నట్లు చెప్పారు.