high-risk
-
23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
ఇన్సూరెన్స్ కింద కోట్ల రూపాయలు ఆర్జించవచ్చనే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. ఇది జరగడానికి కొంతకాలం ముందు సదరు వ్యక్తి ఒకటి, రెండు కాదు సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్నాడు. ఐతే ఏళ్లు గడుస్తున్నా బీమా తాలూకు రూ. 23 కోట్ల డబ్బు పొందలేకపోతున్నాననే బాధతో ఈ పనికి పూనుకున్నాడు సదరు వ్యక్తి. డబ్బుకోసం కాళ్లను నరుక్కున్న ఈ వ్యక్తిని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం హంగేరీకి చెందిన సెందర్ అనే వ్యక్తి ఇన్సురెన్స్ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకుని రెండు కాళ్లు నరుక్కున్నాడు. 2014లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో 54 ఏళ్ల సెందర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకువెళ్లదీస్తున్నాడు. కాళ్లు కోల్పోయిన తర్వాత బీమా డబ్బు కోసం సెందర్ బీమా కంపెనీలను సంప్రదించాడు. కానీ అతని ఎత్తుగడ బీమా సంస్థలు పసిగట్టి అతనికి ఊహించని షాక్ ఇచ్చాయి. నిజానికి సెందర్ తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను ఆలస్యం చేశాయి. దీనితో మనస్థాపం చెందిన సెండర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో విషయం అంతా బట్టబయలయ్యింది. పొదుపు ఖాతాల కంటే బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక సలహా అందుకున్న తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. అందుకే పాలసీలు కూడా తీసుకున్నాడట. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో తాజాగా జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు సరికదా పరువు కూడా పోయింది. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
యూకేకు ప్రయాణం మరింత కఠినం
లండన్: కోవిడ్ వేరియంట్ల వ్యాప్తిని నివారించేందుకు యూకే ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన తాజా ఆంక్షలతో హైరిస్క్ రెడ్ లిస్ట్‌లో ఉన్న 33 దేశాల నుంచి ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన యూకే, ఐర్లాండ్‌కు చెందిన ప్రయాణీకులు హోటల్లో క్వారంటైన్లో గడపాలి. ఈ జాబితాలో భారత్ లేదు. ఇంగ్లండ్‌కు రావాలనుకునే వారు 10 రోజులపాటు ప్రభుత్వం నిర్దేశించిన హోటళ్లలో క్వారంటైన్లో గడిపేందుకు, రవాణా చార్జీలు, వైద్య పరీక్షలకు అవసరమైన 1,750 పౌండ్లు(రూ.1,76,581)ను ముందుగా చెల్లించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. రెడ్ లిస్ట్‌లో లేని భారత్ వంటి దేశాలకు వెళ్లని యూకే, ఐర్లాండ్ నివాసితులు 10 రోజులపాటు తమ ఇళ్లలో క్వారంటైన్లో గడపాలి. ఇంగ్లండ్‌కు చేరుకున్న 2వ, 8వ రోజున తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ‘కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో తాజా చర్యలు తీసుకున్నాం. కొత్త వేరియంట్లను సరిహద్దులు దాటి లోపలికి రానివ్వరాదన్నదే మా లక్ష్యం’అని యూకే ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించింది. యూకే రెడ్‌లిస్ట్‌లో చేర్చిన 33 దేశాల్లో వివిధ కోవిడ్–19 వేరియంట్లు వ్యాప్తిలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు యూకేలోకి ప్రవేశించిన ఏ ప్రాంతం వారైనా ప్రయాణానికి మూడు రోజులు ముందుగా చేయించుకున్న కోవిడ్–19 నెగెటివ్ పరీక్ష రిపోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అదేవిధంగా, రెడ్ లిస్ట్‌లోని 33 దేశాలకు చెందిన యూకే నాన్ రెసిడెంట్లపై బ్రిటన్‌లో ప్రవేశించరాదనే నిబంధన కూడా ఉంది. యూకేలో ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన లాక్డౌన్ నిబంధనలతో అత్యవసరం కాని ప్రయాణాలపై నిషేధం ఉంది. యూకే నుంచి బయటకు వెళ్లాలనుకునే వారిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు మరిన్ని అధికారాలు తాజా నిబంధనల ప్రకారం సరిహద్దు భద్రతా బలగాలకు, పోలీసులకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, అనుమానిత ప్రయాణీకులను గుర్తించి మూడు గంటలపాటు నిర్బంధంలో ఉంచేందుకు వారికి అధికారాలిచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దించారు. క్వారంటైన్ కోసం ప్రభుత్వం 4,963 గదులున్న 16 హోటళ్లను గుర్తించింది. మరో 58 వేల రూంలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణీకులు ఇంగ్లండ్‌కు చేరుకోవడానికి ముందుగానే తమ క్వారంటైన్ రూంలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటైంది. హీత్రూ ఎయిర్‌పోర్టు, గాట్విక్, లండన్ సిటీ, బర్మింగ్‌హామ్, ఫార్న్బరోల్లో హోటళ్లను క్వారంటైన్ కోసం సిద్ధంగా ఉంచారు. -
నా కళ్ల ముందే....
నాకు బైక్‌లు ఇంటే ఇష్టం. వాటిని వేగంగా నడపడం అంటే మరీ ఇష్టం. ఎంత వేగంగా నడిపితే అంత హీరోయిజం అనుకునేవాడిని. ఒకరోజు నేను రోడ్డు మీద రయ్యిమని దూసుకెళుతుంటే నాన్న చూశారు. ఆ రోజంతా క్లాసు తీసుకున్నారు. రెండు రోజుల వరకు బైక్ ఇవ్వలేదు. ఆ తరువాత మళ్లీ మామూలే. ఇంటి పరిసర ప్రాంతాల్లో మాత్రం స్లోగా నడిపేవాడిని. పరిసరాలు దాటగానే విపరీతమైన వేగంతో బైక్ నడిపేవాడిని. స్నేహితులు చెప్పినా, పేపర్లో రోజూ యాక్సిడెంట్ వార్తలు చదివినా నాలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండేది కాదు. ఒకరోజు అయితే త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆరోజు మాత్రం భయపడ్డాను. మరుసటి రోజు షరా మామూలే. దసరా పండక్కి రెండు రోజుల ముందు ఒక పని ఉండి బైక్ మీద వెళుతున్నాను. నా కళ్ల ఎదుటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ కుర్రాడికి ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు. మితిమీరిన వేగంతో నడపడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ దృశ్యం చూసి మనసు వికలమైంది. ఇక ఆ రోజు నుంచి అత్యవసరం అయితే తప్ప బైక్‌ను వాడడం లేదు. ఒకవేళ వాడినా వేగంగా బండి నడపడం లేదు. గతంలో నేను బైక్ మీద వెళుతున్నప్పుడు ఏవేవో ఆలోచిస్తుండేవాడిని. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినే వాడిని. ఇప్పుడు అలాంటివేమీ చేయడం లేదు. నా కళ్ల ముందు జరిగిన ఒక విషాద సంఘటన నాలోని చెడు అలవాటును తుడిచేసింది. -కె.అనిల్‌కృష్ణ, హైదరాబాద్