హై టెన్షన్ విద్యుత్ తీగలు పడి ముగ్గురు మృతి
బిహార్: బిహార్లో మరో విషాదం చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ జిల్లా మజిలియా ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ వైరు తెగి పడి ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తుండగా కరెంట్ తీగలు తెగి ఇంటిపై పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పది రోజుల్లో ఇది రెండో సంఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.